షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష.. వినతిపత్రం ఇచ్చిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు

First Published | Nov 2, 2021, 2:36 PM IST

నిరుద్యోగుల నిరాహార దీక్షలో కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వైయస్ షర్మిల ని కలిసి వినతిపత్రం అందజేశారు.

ys sharmila -ys vijayamma

ఆత్మబలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో ఉద్యమకారులకు ఉద్యోగాలు రాలేదు కానీ అమెరికా నుంచి ఊడిపడ్డ కేసీఆర్ బిడ్డలకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని వైఎస్ షర్మిళ అన్నారు. కాగా.. ఆమె ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం నిరాహార దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ రోజు కూడా ఆమె దీక్ష చేశారు. కాగా.. ఆమె దీక్షకు కొందరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా మద్దుతు తెలిపారు.

ys sharmila

నిరుద్యోగుల నిరాహార దీక్షలో కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వైయస్ షర్మిల ని కలిసి వినతిపత్రం అందజేశారు.

Latest Videos


ys sharmila

వైయస్ఆర్  2008 సంవత్సరంలో హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్ మెంట్ లో కాంట్రాక్టు బేసిక్ మీద 4000 ఉద్యోగాలు ఇచ్చారని.. ఇప్పటికి 14 సంవత్సరాలు కావస్తున్నా నాయకులు తమకు న్యాయం చేయడం లేదని వారు ఈ సందర్భంగా షర్మిల దగ్గర వాపోయారు. జీతాలు తక్కువగా ఇస్తున్నారని.. సమాన పనికి సమాన వేతనం చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

sharmila

టీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ విధాన్ని తీసివేసి, పర్మినెంట్ ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారన్నారు. తమను పర్మినెంట్ చేయాలని చాలా సార్లు పాలకులకు విన్నపించుకున్నామన్నారు. ధర్నాలు చేసి, వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేదన్నారు. YSR తెలంగాణ పార్టీ అధికారంలోకి వచ్చాక మాకు న్యాయం చేస్తారని నమ్ముతున్నామని ఉద్యోగులు షర్మిల తో పేర్కొన్నారు. 

sharmila

ఇదిలా ఉండగా.. ప్రముఖ ఉద్యమకారుడు, కళాకారుడు శ్రీ జంగ్ ప్రహ్లాద్ గారు కన్ను మూశారు. కాగా.. ఆయన మృతికి  షర్మిల సంతాపం తెలియజేశారు. ఉద్యమ సమయంలో ఆయన చేసిన సేవలు అమోఘమైనవని  షర్మిల పేర్కొన్నారు. తెలంగాణ సమాజం ఎన్నటికీ ఆయన్ను గుర్తుంచుకుంటుందన్నారు.. ప్రహ్లాద్ గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్టన్లు చప్పారు. ఆయన ఆత్మ ఆ పరమాత్మలో ఐక్యం కావాలని కోరుకుంటున్నామన్నారు. జంగ్ ప్రహ్లాద్ గారి ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని వైయ‌స్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి శ్రీ‌మ‌తి వైయ‌స్ ష‌ర్మిల గారు మౌనం పాటించారు.

click me!