Huzurabad Bypoll : సిలిండర్ కి దండం పెట్టి.. ఓటు వేయడానికి వెడుతున్న మహిళలు..

First Published | Oct 30, 2021, 9:47 AM IST

హుజరాబాద్ నియోజకవర్గం, కమలాపూర్ మండలంలోని గుండెడు గ్రామంలో మహిళలు గ్యాస్ సిలిండర్ కి దండం పెట్టి ఓటు వేయడానికి బయల్దేరారు. 

Huzurabad Bypoll

దేశంలో వంట గ్యాస్ ధ‌ర‌లు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దీంతో సామాన్యుడి మెడకు ఉరి బిగించినట్టు అయ్యింది. వంటగ్యాస్ ధరలు సిలిండర్ వెయ్యి రూపాయలకు చేరువగా రావడంతో.. నానా ఇబ్బందులు పడుతున్నారు. 

హుజరాబాద్ నియోజకవర్గం, కమలాపూర్ మండలంలోని గుండెడు గ్రామంలో మహిళలు గ్యాస్ సిలిండర్ కి దండం పెట్టి ఓటు వేయడానికి బయల్దేరారు. 

Huzurabad Bypoll

చమురు కంపెనీలు ప్రతి నెల 1వ తేదీన ఎల్‌పి‌జి సిలిండర్ల ధరలను సమీక్షిస్తుంటాయి. అయితే దీని పన్ను రాష్ట్రం నుండి రాష్ట్రానికి మారుతుంది. అలాగే తదనుగుణంగా ఎల్‌పి‌జి ధరలు మారుతూ ఉంటాయి. దేశంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు 14.2 కిలోల ఎల్‌పి‌జి సిలిండర్ల ధరలను నేడు రూ .15 పెంచాయి. మరోవైపు 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. 

అక్టోబర్ 1న పెంచిన ధరలతో రెండు నెలల కన్నా తక్కువ వ్యవధిలో గ్యాస్ సిలిండర్ల ధారలలో ఇది నాల్గవ పెరుగుదల. సబ్సిడీ సిలిండర్ ధర గత నెల అంటే సెప్టెంబర్ 1న రూ.25 పెరిగింది. సబ్సిడీ ఎల్‌పిజి ధర జనవరి 1 నుండి తాజా పెంపుతో సిలిండర్‌పై రూ. 205 పెరిగింది. ఈ నెలలో 19కేజీల కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.43 పెరగడం సామాన్యులకు పెను భారంగా మారింది.


Huzurabad Bypoll

నేడు జరుగుతున్న హుజురాబాద్ ఉప ఎన్నికలో గ్యాస్ సిలిండర్ ధరలు కీలకం కానున్నాయి. అక్కడ ప్రచారం అంతా పెరిగిన సిలిండర్ల చుట్టూ సాగడం, ఓటు వేయడానికి వెళ్లే ముందు సిలిండర్లకు మొక్కి, టీఆర్ఎస్ కు ఓటు వేయాలంటూ ప్రచారం చేయడంతో.. అది పార్టీ గుర్తు కావచ్చనే గందరగోళమూ నెలకొంది. 

హుజురాబాద్లో  పోలింగ్ కి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ పూర్లయ్యి.. పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమయ్యింది.  పోలింగ్ సాయంత్రం ఏడు గంటల వరకు జరుగుతుంది. హుజురాబాద్ నియోజకవర్గం లో 306 పోలింగ్ కేంద్రాలని ఏర్పాటు చేసారు.. నియోజకవర్గం లోని ఐదు మండలాలలో మొత్తం 2,37,036 ఓటర్లు ఉండగా, పురుషులు 1,17,933, కాగా స్త్రీలు 1,19,102 ఉన్నారు. ఇతరులు ఒక్క ఓటరు ఉన్నారు.

huzurabad

ఇక హుజురాబాద్ ఉప ఎన్నిక కోవిడ్ నిబంధనాలు అనుసరించి జరుగుతున్నాయి. నియోజకవర్గం లో  144 సెక్షన్ అమలులో ఉంటుందని కలెక్టర్ కన్నల్ఇప్పటికే తెలిపారు. ఉప ఎన్నిక కోసం 421 కంట్రోల్ యూనిట్లు, 891 బ్యాలెట్ యూనిట్లు,515 వివి ప్యాడ్ యూనిట్లని వినియోగిస్తున్నారు.

మొత్తం 1715 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. నిన్న సాయంత్రం లోగా పోలింగ్ సిబ్బంది తమకి కేటాయించిన సామాగ్రితో తమకి కెటాయించిన పోలింగ్ కేంద్రాలకి చేరుకున్నారు..306 పోలింగ్ స్టేషన్ లలో లైవ్ వెబ్ కాస్టింగ్ నిర్వహించారు..!

huzurabad

పోలింగ్ కేంద్రానికి వచ్చే ప్రతి ఓటరు సానిటైజ్ చేసుకొనేలా ఏర్పాటు చేసారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో హెల్త్ వర్కర్స్ థర్మమీటర్ తో టెంపరేచర్ ని పరీక్షించి లోపలికి పంపుతున్నారు. ఓటు హక్కు వినియోగించుకునే కోవిడ్ పేషెంట్ లకి ప్రత్యేక పిపిఈ కిట్లు, కుడి చెతికి గ్లౌజులు సిద్దంగా ఉంచారు.

సోషల్ మిడియాలో వచ్చే ఫేక్ వార్తలు నమ్మవద్దని ప్రజలు శాంతియుత వాతావరణం లో ఓటు హక్కు,స్వేచ్ఛా గా వినియోగించుకోవాలని కోరారు. 3880 మంది పోలిసులతో పటిష్ఠమైన బందోబస్తుని ఏర్పాటు చేసారు.

huzurabad

ఈటెల భూ అక్రమాలకు పాల్పడ్డాడనే కారణంతో ఆయనపై సీఎం కేసీఆర్ విచారణ చేపట్టడం, ఆ వెంటనే ఈటెల పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడం, ఆ తరువాత తన ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయడం చకచకా జరిగిపోయాయి.  ఈ నేపథ్యంలో వచ్చిన ఉపఎన్నికల్లో తెరాస తరుఫు నుంచి విద్యార్ధి ఉద్యమ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ బరిలో ఉండగా... బీజేపీ నుంచి ఈటెల బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ బరిలో నిలిచాడు. ప్రధానంగా పోటీ ఈ మూడు పార్టీల మధ్యనే నెలకొన్నప్పటికీ... కాంగ్రెస్ పార్టీకి పడే ఓట్లు విజేతను నిర్దేశించనున్నాయి..!
 

Latest Videos

click me!