రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి శాంతమ్మ హైదరాబాద్ లో శుక్రవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో గుండెపోటుతో మరణించారు.
telangana minister V. Srinivas Gowda s mother died in hyderabad
మహబూబ్ నగర్ : తెలంగాణ ఎక్సైజ్, క్రీడల శాఖామంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ఇంట మరో విషాదం చోటుచేసుకుంది. రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి శాంతమ్మ హైదరాబాద్ లో శుక్రవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో గుండెపోటుతో మరణించారు.
శాంతమ్మ Funerals మహబూబ్ నగర్ పట్టణంలోని వారి వ్యవసాయ క్షేత్రంలో ఈ రోజు (శనివారం) సాయంత్రం జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
27
telangana minister V. Srinivas Gowda s mother died in hyderabad
కాగా, ఈ యేడు ఫిబ్రవరిలో శ్రీనివాస్ గౌడ్ తండ్రి నారాయణగౌడ్(73) మృతి చెందారు. వయసుమీద పడటంతో, కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న నారాయణ గౌడ్, ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబసభ్యులు సోమాజిగూడ యశోద హాస్పిటల్ లో చేర్చారు.
ఈ క్రమంలోనే ఫిబ్రవరి 14, ఆదివారం అతడి పరిస్థితి మరింత దిగజారి తుదిశ్వాస విడిచారు. దీంతో మంత్రి V Srinivas Gowda ఇంట విషాదఛాయలు అలుముకున్నారు.
37
telangana minister V. Srinivas Gowda s mother died in hyderabad
కన్నతండ్రి మృతిచెందడంతో బాధలో మునిగిపోయిన మంత్రిని సహచర మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఓదార్చారు. నారాయణగౌడ్ మరణ వార్త తెలిసిన వెంటనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రలు నిరంజన్‌రెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు దామోదర్‌రెడ్డి, బాల్క సుమన్‌లు యశోదా ఆస్పత్రికి వెళ్లారు.
47
telangana minister V. Srinivas Gowda s mother died in hyderabad
పార్థీవదేహానికి నివాళి అర్పించి మంత్రిని ఓదార్చారు. ఇక అసెంబ్లీ స్పీకర్ పోచారం, మంత్రి జగదీష్ రెడ్డిలు కూడా మంత్రికి ఫోన్ చేసి ఓదార్చారు. మంత్రి తండ్రి నారాయణగౌడ్ రిటైర్డ్ హెడ్ మాస్టర్. అందరితో కలుపుగోలుగా వుండే అతడు మరణించినట్లు తెలియడంతో స్వగ్రామంలో కూడా విషాదం నెలకొంది.
సోమవారం ఫిబ్రవరి 15న స్వగ్రామంలోనే నారాయణ గౌడ్ అంత్యక్రియలు జరిగాయి. ఇందులో మహబూబ్ నగర్ జిల్లా టీఆర్ఎస్ నాయకులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
57
telangana minister V. Srinivas Gowda s mother died in hyderabad
ఇదిలా ఉండగా, ఇటీవలే తండ్రిని కోల్పోయిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను ఆయన నివాసంలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఫిబ్రవరి 18న కలిసి పరామర్శించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తండ్రి నారాయణ గౌడ్ అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. మహబూబ్‌నగర్ లోని మంత్రి ఇంటికి వచ్చిన హరీశ్ రావు నారాయణ గౌడ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
67
sinivas gowd
ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. అనంతరం జరిగిన విషాదం పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నారాయణ గౌడ్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
77
కాగా, తండ్రిని కోల్పోయిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఫిబ్రవరి 24న పరామర్శించారు. శ్రీనివాస్ గౌడ్ తండ్రి నారాయణ గౌడ్ దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ఆయన ఫోటోకు పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం మంత్రి తల్లితో పాటు కుటుంబసభ్యులను ఓదార్చారు.