హైద్రాబాద్‌‌‌లో వరదలు: గతంలో ముంచెత్తిన ముప్పులు ఇవీ...

Published : Oct 20, 2020, 03:54 PM ISTUpdated : Oct 20, 2020, 03:59 PM IST

హైద్రాబాద్ నగరంలో భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజులుగా పలు కాలనీలు నీట మునిగాయి. ఇంకా మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

PREV
17
హైద్రాబాద్‌‌‌లో వరదలు: గతంలో ముంచెత్తిన ముప్పులు ఇవీ...

హైద్రాబాద్ నగరంలో ఈ నెల 13వ తేదీన కురిసిన భారీ వర్షంతో నగరం నీట మునిగిపోయింది. 117 ఏళ్ల తర్వాత నగరాన్ని భారీ వర్షం కురిసిందని అధికారులు ప్రకటించారు. అయితే గతంలో కూడ భారీ వర్షాలు హైద్రాబాద్ ను ముంచెత్తాయి.

27

గతంలో కురిసిన సమయంలో నాలాలు, చెరువుల నుండి నీరు దిగువకు వెళ్లిపోయే పరిస్థితి ఉండడంతో అంత పెద్దగా ప్రమాదం లేదనే అభిప్రాయాలున్నాయి. అయితే  గతానికి భిన్నంగా హైద్రాబాద్ నగరంలో పరిస్థితులున్నాయి. 

37

నాలాలు, చెరువులు కబ్జాకు గురయ్యాయి. వీటిపై నిర్మాణాలు చోటు చేసుకొన్నాయి. దీంతో నగరం వరద నీటిలో మునిగిపోయిందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. నాలాలు,చెరువులు కబ్జాలకు గురికావడం ఒక్క రోజుతో జరిగింది కాదు. అన్ని ప్రభుత్వాల హయంలో ఈ పరిణామాలు చోటు చేసుకొన్నాయని స్వయంగా మంత్రి కేటీఆర్ సోమవారం నాడు ప్రకటించిన విషయం తెలిసిందే.

47

హైద్రాబాద్ నగరంలో 1908 సెప్టెంబర్ రెండో తేదీన 153.2 మి.మీ వర్షపాతం నమోదైంది. 1954 ఆగష్టు 1న  190.5 మి.మీ, 1970 ఆగష్టులో 140 మి.మీ, 2000 ఆగష్టు 24 240 మి.మీ వర్షపాతం నమోదైంది.
 
57

2001 ఆగష్టులో 230.4 మి.మీ, 2002  ఆగష్టు 179.4 మి.మీ.,2006 ఆగష్టులో218.7 మి.మీ.  వర్షపాతం నమోదైంది. 2008 ఆగష్టులో 220.7 మి.మీ వర్షపాతం, 2016 సెప్టెంబర్ లో 215 మి.మీ వర్షపాతం నమోదైనట్టుగా రికార్డులు చెబుతున్నాయి. ఈ నెల 13వ తేదీన 32 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఈ నెల 17న సగటున 10 సెం.మీ. వర్షపాతం నమోదైనట్టుగా అధికారులు చెబుతున్నారు.

67

హైద్రాబాద్ నగరంలో 2006 ఆగష్టు మాసంలో 36 గంటల్లో 230 మి.మీ వర్షపాతం నమోదైంది. 2016 సెప్టెంబర్ 25 వరకు ఈ రికార్డు అలానే ఉందని అధికారులు చెబుతున్నారు. 

77

నగరంలో  గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్థంభించిపోయింది. నగరంలో సాధారణ పరిస్థితులు వచ్చిన తర్వాత కబ్జాలకు గురైన చెరువులు, నాలాలపై ఏం చేయాలనే దానిపై కార్యాచరణను చేపట్టనున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.

click me!

Recommended Stories