పీసీసీకి కొత్త చీఫ్: సీనియర్ల ఢిల్లీ టూర్ వెనుక ఉద్దేశ్యమదేనా?

First Published Dec 14, 2020, 2:55 PM IST

టీపీసీసీ కొత్త చీప్ ఎంపిక పార్టీ నాయకత్వానికి అంతా సులభం కాదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. పార్టీ నేతలను సంతృప్తి పర్చేలా కొత్త చీఫ్ ఎంపిక ఉంటుందా అనే  చర్చ సాగుతోంది. కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక కోసం ఠాగూర్  నేతల నుండి అభిప్రాయాలను సేకరించారు. 

టీపీసీసీ చీఫ్ పదవి కోసం పార్టీ నేతలతో సంప్రదింపులు పూర్తయ్యాయి. కొత్త పీసీసీ చీఫ్ ఎవరనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ తరుణంలో కొందరు కాంగ్రెస్ సీనియర్లు ఢీల్లీ వెళ్లాలని నిర్ణయం తీసుకోవడం కూడ పార్టీలో చర్చకు దారితీసింది.
undefined
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత టీపీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. టీపీసీసీ చీఫ్ పదవికి కొత్తవారిని ఎంపిక చేయాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.
undefined
మూడు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ నేతల నుండి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ అభిప్రాయాలను సేకరించారు.
undefined
పీసీసీ చీఫ్ పదవిని ఆశిస్తున్న నేతలతో పాటు ఇతరులతో కూడ ఠాగూర్ ముఖాముఖి సమావేశమయ్యారు. మెజారిటీ నేతలు రేవంత్ రెడ్డికి మద్దతు ప్రకటించారనే ప్రచారం కూడ సాగుతోంది.
undefined
రేవంత్ రెడ్డి టీడీపీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో మొదటి నుండి ఉన్నవారిని కాదని టీడీపీ నుండి వచ్చిన రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వొద్దని కొందరు నేతలు పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నారని సమాచారం.
undefined
రేవంత్ కు ఈ పదవిని అప్పగించకుండా ఉండేందుకు సీనియర్లు పావులు కదుపుతున్నారు. పార్టీలో అందరిని సమన్వయం చేసుకొంటూ వెళ్లేవారికి ఈ పదవిని కట్టబెట్టాలని కోరుతున్నారు. ఈ మేరకు రాహుల్ గాంధీ, సోనియాగాంధీలను కలవాలని కొందరు సీనియర్లు ఢిల్లీకి వెళ్లాలని భావిస్తున్నారనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో ఉంది.
undefined
సోషల్ మీడియాలో జరిగిన ప్రచారానికి సంబంధించిన అంశాలను కొందరు నేతలు ఠాగూర్ దృష్టికి తీసుకెళ్లారు. తమ అభిప్రాయాలను జాగ్రత్తగా పరిశీలించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఠాగూరుకు వివరించారు.
undefined
పార్టీ వ్యవహారాలు సజావుగా జరిగేలా పీసీసీ అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. పీసీసీ చీఫ్ రేసులో జగ్గారెడ్డి కూడ ఉన్నారు.
undefined
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి మధ్య ప్రధాన పోటీ ఉందని సమాచారం. సీనియర్లలో కొందరు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మద్దతుగా ఉన్నారని సమాచారం.
undefined
పీసీసీ చీఫ్ పదవి ఎవరికి ఇసతే రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే అవకాశాలున్నాయనే విషయమై పార్టీ అగ్రనేతలకు వివరించే పేరుతో కొందరు సీనియర్లు ఢిల్లీకి వెళ్లాలని భావిస్తున్నారు. తమ వైరి వర్గానికి పీసీసీ చీఫ్ పదవి దక్కకుండా ఆపేందుకే ఢిల్లీ టూర్ కు సీనియర్లు ప్లాన్ చేశారనే ప్రచారం కూడ లేకపోలేదు.
undefined
click me!