టీపీసీసీ చీఫ్ పదవి: కాంగ్రెస్‌లో హీట్, ఢీల్లీకి కాంగ్రెస్ సీనియర్లు

Published : Dec 13, 2020, 02:23 PM IST

టీపీసీసీ చీఫ్ గా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎవరిని ఎంపిక చేయనుందనేది ప్రస్తుతం చర్చకు దారితీసింది. కాంగ్రెస్ పార్టీ  నేతల నుండి అభిప్రాయ సేకరణ పూర్తైంది. ఠాగూర్ నివేదిక ఆధారంగా పీసీసీ చీఫ్ ఎంపికపై నాయకత్వం నిర్ణయం తీసుకోనుంది.

PREV
112
టీపీసీసీ చీఫ్ పదవి: కాంగ్రెస్‌లో హీట్, ఢీల్లీకి కాంగ్రెస్ సీనియర్లు

టీపీసీసీ చీఫ్ పదవి కాంగ్రెస్ పార్టీలో హీట్‌ పెంచింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు సీనియర్లు రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ కోరుతున్నారు. టీపీసీసీ చీఫ్ పదవి విషయమై కాంగ్రెస్ సీనియర్లు రాహుల్ గాంధీతో చర్చించే అవకాశం ఉందని సమాచారం.

212

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండు కార్పోరేట్ స్థానాలకే పరిమితమైంది. దీంతో టీపీసీసీ చీఫ్ పదదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో టీపీసీసీ చీఫ్ పదవికి కొత్త నేతను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ పార్టీ నేతల నుండి అభిప్రాయాలను సేకరించారు.

312

మూడు రోజుల పాటు పార్టీ నేతల నుండి అభిప్రాయాలను సేకరించి శనివారం నాడు ఆయన ఢిల్లీ వెళ్లిపోయారు. పీసీసీ చీఫ్ పదవి కోసం  కాంగ్రెస్ పార్టీ నేతల నుండి మాణికం ఠాగూర్ అభిప్రాయాలను  సేకరించారు. టీపీసీసీ చీఫ్ పదవి కోసం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు లతో పాటు  మరికొందరి నేతల పేర్లు ప్రచారంలో ఉన్నాయి.

412

టీపీసీసీ చీఫ్ పదవి విషయమై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలవాలని  కాంగ్రెస్ సీనియర్లు భావిస్తున్నారు.  రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ కోసం సీనియర్లు ప్రయత్నిస్తున్నారు. రేపు లేదా ఎల్లుండి కాంగ్రెస్ సీనియర్లు రాహుల్ గాంధీని కలిసే అవకాశం ఉందని సమాచారం.

512

టీపీసీసీ చీఫ్ పదవి కోసం  పార్టీ నేతలు లాబీయింగ్ చేస్తున్నారు. పార్టీలో అందరి నేతలను కలుపుకొనివవెళ్లే మాజీ మంత్రి శ్రీధర్ బాబును కొందరు నేతలు సూచించారని సమాచారం.

612

మరోవైపు మెజారిటీ నేతలు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి పేరును కూడ సూచించినట్టుగా ప్రచారం సాగుతోంది. రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం ఈ విషయమై అప్రమత్తమైనట్టుగా తెలుస్తోంది.

712

ఎవరికి పీసీసీ చీఫ్ పదవిని ఇస్తే ఏ రకమైన పరిస్థితులు ఉంటాయనే విషయమై కూడ పార్టీ నేతలు ఇప్పటికే ఠాగూర్ దృష్టికి తీసుకొచ్చారు. 

812

ఇప్పటివరకు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్నారు. బీసీ సామాజికవర్గానికి కాంగ్రెస్ అధ్యక్ష పదవిని కేటాయించాలనే డిమాండ్ కూడ ఉంది.

912

రాష్ట్రంలో వరుసగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ఫలితాలు దక్కడం లేదు. కాంగ్రెస్ ను దాటి బీజేపీ ముందు వరుసలో నిలుస్తోంది. టీఆర్ఎస్ కు తామే ప్రత్నామ్నాయమని బీజేపీ చెబుతోంది.  

1012

బీజేపీకి ధీటుగా సమాధానం చెప్పే నాయకత్వం పార్టీకి అవసరమని కాంగ్రెస్ నేతలు అభిప్రాయంతో ఉన్నారు. అంతేకాదు 2023 వరకు పార్టీని నడిపే సమర్ధత ఉన్నవారికి పార్టీ నాయకత్వ బాధ్యతలను కట్టబెట్టాలని కోరుతున్నారు.

1112

ఈ విషయాలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి వివరించేందుకు గాను కాంగ్రెస్ సీనియర్లు ఢిల్లీకి వెళ్లాలని భావిస్తున్నారు.

1212

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, పోడెం వీరయ్య తదితరులు ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. రేపు లేదా ఎల్లుండి వీరంతా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది.

click me!

Recommended Stories