రాజ్యసభకు రేణుకా చౌదరి:ఖమ్మం ఎంపీ సీటు కాంగ్రెస్‌లో ఎవరికో?

First Published | Feb 15, 2024, 10:04 AM IST

మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరికి  కాంగ్రెస్ నాయకత్వం  రాజ్యసభ టిక్కెట్టు కేటాయించింది. దీంతో  ఖమ్మం పార్లమెంట్ స్థానం నుండి  కాంగ్రెస్ టిక్కెట్టు ఎవరికి దక్కుతుందనే చర్చ ప్రస్తుతం నెలకొంది.

రాజ్యసభకు రేణుకా చౌదరి:ఖమ్మం ఎంపీ సీటు కాంగ్రెస్‌లో ఎవరికో?

తెలంగాణ రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాలకు  కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలను కైవసం చేసుకుంటుంది. రెండు 
స్థానాలకు గాను మాజీ కేంద్ర మంత్రి  రేణుకా చౌదరి,  మాజీ ఎంపీ  అంజన్ కుమార్ యాదవ్ తనయుడు అనిల్ కుమార్ యాదవ్ పేర్లను కాంగ్రెస్ నాయకత్వం ఖరారు చేసింది

రాజ్యసభకు రేణుకా చౌదరి:ఖమ్మం ఎంపీ సీటు కాంగ్రెస్‌లో ఎవరికో?

భారత రాష్ట్ర సమితి నుండి  ప్రస్తుత ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పేరును ఆ పార్టీ నాయకత్వం ఖరారు చేసింది. ముగ్గురు అభ్యర్థులు ఇవాళ నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

రాజ్యసభకు రేణుకా చౌదరి:ఖమ్మం ఎంపీ సీటు కాంగ్రెస్‌లో ఎవరికో?

తెలంగాణ నుండి  సోనియా గాంధీని పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ  తీర్మానం చేసింది.ఈ తీర్మానం కాపీని కూడ  తెలంగాణ సీఎం  అనుముల రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు సోనియా గాంధీకి అందించారు.

రాజ్యసభకు రేణుకా చౌదరి:ఖమ్మం ఎంపీ సీటు కాంగ్రెస్‌లో ఎవరికో?

తెలంగాణ నుండి సోనియా గాంధీ పోటీచేయడానికి అంగీకరిస్తే  ఖమ్మం పార్లమెంట్ స్ధానం నుండి పోటీ చేయించాలని  ఆ పార్టీ భావిస్తుంది. ఖమ్మంతో పాటు  మల్కాజిగిరి, మెదక్ పార్లమెంట్ స్థానాలను కూడ కాంగ్రెస్ నాయకత్వం సోనియా గాంధీ కోసం  పరిశీలిస్తుందనే ప్రచారం లేకపోలేదు. అయితే అనుహ్యంగా  రాజస్థాన్ నుండి సోనియా గాంధీ రాజ్యసభ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేయడంతో  ప్రత్యక్ష ఎన్నికలకు సోనియాగాంధీ దూరంగా ఉండనున్నారని తేలింది.

రాజ్యసభకు రేణుకా చౌదరి:ఖమ్మం ఎంపీ సీటు కాంగ్రెస్‌లో ఎవరికో?

సోనియా గాంధీ  తెలంగాణ నుండి కాకుండా రాజస్థాన్ నుండి పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం కూడ  సాగుతుంది.  సోనియా గాంధీ పోటికి ఆసక్తిగా లేకపోతే ప్రియాంక గాంధీని తెలంగాణ నుండి పోటీ చేయాలని కూడ ఆ పార్టీ నేతలు కోరుతున్నారు.అయితే ఈ విషయమై  ప్రియాంక గాంధీ నిర్ణయం తేలాల్సి ఉంది

రాజ్యసభకు రేణుకా చౌదరి:ఖమ్మం ఎంపీ సీటు కాంగ్రెస్‌లో ఎవరికో?

ఇదిలా ఉంటే  కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు  సోనియా గాంధీ,  ప్రియాంక గాంధీలు ఖమ్మం నుండి పోటీ చేస్తే తాను పోటీ నుండి చేయబోనని లేకపోతే తానే ఖమ్మం నుండి పోటీ చేస్తానని  మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి గతంలో  ప్రకటించారు.

రాజ్యసభకు రేణుకా చౌదరి:ఖమ్మం ఎంపీ సీటు కాంగ్రెస్‌లో ఎవరికో?

అయితే  కాంగ్రెస్ నాయకత్వం  రేణుకా చౌదిరికి  రాజ్యసభ సీటు కేటాయించింది.  దీంతో ఖమ్మం పార్లమెంట్ స్థానం నుండి  కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరిని బరిలోకి దింపుతుందనే చర్చ ప్రస్తుతం ఆసక్తికరంగా సాగుతుంది.

రాజ్యసభకు రేణుకా చౌదరి:ఖమ్మం ఎంపీ సీటు కాంగ్రెస్‌లో ఎవరికో?

ఖమ్మం పార్లమెంట్ స్థానం నుండి  కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టుపై పోటీకి  పలువురు ధరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి, తెలంగాణ మంత్రి  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు సహా పలువురు  ఈ టిక్కెట్టు కోసం  ధరఖాస్తు చేసుకున్నారు. అయితే  కాంగ్రెస్ పార్టీ నాయకత్వం  ఖమ్మం సీటు ఎవరికి కేటాయిస్తుందోననే చర్చ ప్రస్తుతం రాజకీయవర్గాల్లో నెలకొంది. 
ఖమ్మం పార్లమెంట్ స్థానం నుండి  గతంలో రేణుకా చౌదరి ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. 

Latest Videos

click me!