కేఆర్ఎంబీపై బీఆర్ఎస్, మేడిగడ్డపై కాంగ్రెస్: రాజకీయంగా పై చేయి ఎవరిదో?

First Published | Feb 12, 2024, 6:45 PM IST

కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు నీటి పారుదల ప్రాజెక్టుల అంశంపై  పోటా పోటీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. రాజకీయంగా పై చేయి సాధించడం కోసం రెండు పార్టీలు  కార్యాచరణను సిద్దం చేస్తున్నాయి.

కేఆర్ఎంబీపై బీఆర్ఎస్, మేడిగడ్డపై కాంగ్రెస్: రాజకీయంగా పై చేయి ఎవరిదో?

కృష్ణా నదిపై ప్రాజెక్టులను  కేఆర్ఎంబీకి అప్పగించారనే ఆరోపణల నేపథ్యంలో  ఈ నెల  13న నల్గొండలో  భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) భారీ సభను ఏర్పాటు చేసింది. మరో వైపు  మేడిగడ్డ బ్యారేజీ వద్దకు తెలంగాణ ఎమ్మెల్యేలను  కాంగ్రెస్ ప్రభుత్వం  ఈ నెల  13న తీసుకెళ్లనుంది.  సాగునీటి ప్రాజెక్టులపై  కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు పోటా పోటీగా కార్యక్రమాలను  నిర్వహించనున్నాయి.

కేఆర్ఎంబీపై బీఆర్ఎస్, మేడిగడ్డపై కాంగ్రెస్: రాజకీయంగా పై చేయి ఎవరిదో?

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణా నదిపై  ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించారని  భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆరోపిస్తుంది. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తే  తీవ్ర నష్టమని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.

కేఆర్ఎంబీపై బీఆర్ఎస్, మేడిగడ్డపై కాంగ్రెస్: రాజకీయంగా పై చేయి ఎవరిదో?

 తాము అధికారంలో ఉన్న సమయంలో  కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించలేదని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ  ఈ నెల  13న నల్గొండలో బీఆర్ఎస్ సభ నిర్వహించనుంది.  కృష్ణా జలాలపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరును  బీఆర్ఎస్ ఎండగట్టనుంది.

కేఆర్ఎంబీపై బీఆర్ఎస్, మేడిగడ్డపై కాంగ్రెస్: రాజకీయంగా పై చేయి ఎవరిదో?

అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నిర్వహిస్తున్న తొలి సభ ఇది. ఈ సభలో కేసీఆర్ పాల్గొంటారు.  కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించడం ద్వారా రైతులకు, రాష్ట్రానికి ఎలా నష్టం జరుగుతుందో  వివరించనున్నారు బీఆర్ఎస్ నేతలు.

కేఆర్ఎంబీపై బీఆర్ఎస్, మేడిగడ్డపై కాంగ్రెస్: రాజకీయంగా పై చేయి ఎవరిదో?

మరో వైపు  బీఆర్ఎస్ కు పోటీగా మేడిగడ్డకు  ఎమ్మెల్యేలను తీసుకెళ్లనుంది కాంగ్రెస్. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సాగుతున్నాయి.కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా  మేడిగడ్డ బ్యారేజీని  అప్పట్లో అధికారంలో ఉన్న  భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం నిర్మించింది.

కేఆర్ఎంబీపై బీఆర్ఎస్, మేడిగడ్డపై కాంగ్రెస్: రాజకీయంగా పై చేయి ఎవరిదో?

మేడిగడ్డ  బ్యారేజీ పిల్లర్లు కుంగుబాటుకు గురయ్యాయి. గత ఏడాది  అక్టోబర్ మాసంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ బ్యారేజీని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడ పరిశీలించారు. ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.  ఈ నివేదికలో కీలక విషయాలు వెలుగు చూశాయి. 

కేఆర్ఎంబీపై బీఆర్ఎస్, మేడిగడ్డపై కాంగ్రెస్: రాజకీయంగా పై చేయి ఎవరిదో?

తెలంగాణ అసెంబ్లీ నుండి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ సర్కార్  రేపు మేడిగడ్డకు తీసుకెళ్లనుంది.  మేడిగడ్డలో  ఎమ్మెల్యేలకు  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇవ్వనున్నారు

కేఆర్ఎంబీపై బీఆర్ఎస్, మేడిగడ్డపై కాంగ్రెస్: రాజకీయంగా పై చేయి ఎవరిదో?

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆ పార్టీ  పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది.  మేడిగడ్డ బ్యారేజీలో  ఏం జరిగిందనే విషయాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో  ఎమ్మెల్యేలను తీసుకెళ్తుంది ప్రభుత్వం.

కేఆర్ఎంబీపై బీఆర్ఎస్, మేడిగడ్డపై కాంగ్రెస్: రాజకీయంగా పై చేయి ఎవరిదో?

నల్గొండలో బీఆర్ఎస్ సభకు పోటీగా అధికార పార్టీ ఎమ్మెల్యేలను మేడిగడ్డ బ్యారేజీకి తీసుకెళ్తుందని  గులాబీ నేతలు విమర్శలు చేస్తున్నారు. నీటి ప్రాజెక్టుల అంశంపైనే కాంగ్రెస్ , బీఆర్ఎస్ లు   పోటా పోటీగా ఈ నెల  13న కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ రెండు పార్టీలు ఒకరిపై మరొకరు పై చేయి సాధించడం కోసం  వ్యూహాలు రచిస్తున్నాయి

Latest Videos

click me!