Swetcha Votarkar : ఎవరీ స్వేచ్చ వొటార్కర్?

Published : Jun 28, 2025, 06:09 PM ISTUpdated : Jun 28, 2025, 06:30 PM IST

హైదరాబాద్ లో నివాసముండే స్వేచ్చ వొటార్కర్ ఆత్మహత్య తెలుగు మీడియాలో కలకలం రేపింది. ఇంతకూ ఎవరీ స్వేచ్చ?  

PREV
15
స్వేచ్చ వొటార్కర్ సూసైడ్

Swethca Votarkar : ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ యాంకర్, రచయిత్రి స్వేచ్చ వొటార్కర్ ఆత్మహత్య సంచలనంగా మారింది. మీడియా రంగంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఆమె సూసైడ్ వార్త తోటి జర్నలిస్టులను దిగ్భ్రాంతికి గురిచేసింది. రాజకీయ ప్రముఖులు సైతం స్వేచ్చ మృతిపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జవహర్ నగర్ లో స్వేచ్చ నివాసం ఉండేది. భర్తతో విడాకులు తీసుకుని కొన్నేళ్లుగా కూతురితో కలిసి ఉంటోంది. తల్లిదండ్రులు రాంనగర్ లోనే ఉంటున్నా ఈమె మాత్రం వేరుగానే ఉండేది. అయితే కొంతకాలంగా ఆమె ఓ స్నేహితుడితో కలిసి ఉంటున్నట్లు... అతడితో విబేదాలే ఆత్మహత్యకు కారణమై ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.

25
అసలు ఎవరీ స్వేచ్చ?

హైదరాబాద్ లో స్థిరపడిన శంకర్, శ్రీదేవి దంపతుల కూతురే స్వేచ్చ వొటార్కర్. ఈమె తండ్రి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో పీడీఎస్‌యూ (ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ స్టూడెంట్ యూనియన్) రాష్ట్రాధ్యక్షుడిగా పనిచేశారు. తల్లి చైతన్య మహిళా సంఘంలో పనిచేశారు. ఇలా తల్లిదండ్రులిద్దరూ అభ్యుదయ భావాలు కలిగినవారు కావడంతో స్వేచ్చకు కూడా అలాంటి భావాలే ఉండేవి.

చదువు అయిపోగాకే మీడియాలో రంగంలో అడుగుపెట్టారు స్వేచ్చ. మొదట మహా న్యూస్ తో ప్రారంభమైన ఆమె కెరీర్ తర్వాత హెచ్ఎం టివి, టివి9 లో సాగింది. టివి9లో 12 సంవత్సరాలు పనిచేశారు... ఈ సమయంలోనే యాంకర్ గా స్వేచ్చకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం టీ న్యూస్ లో పనిచేస్తున్నారు. ఇలా గత 18 సంవత్సరాలు మీడియా రంగంలో ఉన్నారు.

మంచి యాంకర్ గానే కాదు సీనియర్ జర్నలిస్ట్, రచయిత్రిగా స్వేచ్చకు గుర్తింపు ఉంది. ఆమె TUWJ (తెలంగాణ స్టేట్ యూనియన్ వర్నింగ్ జర్నలిస్ట్స్) స్టేట్ జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. ఇటీవలే జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో ఎన్నికల్లో ఈసి మెంబర్ గా ఎన్నికయ్యారు.

35
స్వేచ్చ వ్యక్తిగత జీవితం

స్వేచ్చ ప్రొఫెషనల్ లైఫ్ సాఫీగానే సాగినా వ్యక్తిగత జీవితమే ఒడిదుడుకులకు లోనయ్యింది. 2014 లో స్వేచ్చకు వివాహమవగా కొన్నాళ్లు సంసారజీవితం బాగానే సాగింది. దీంతో స్వేచ్చ ఓ ఆడపిల్లకు జన్మనిచ్చింది. తర్వాత మనస్పర్ధల కారణంగా భార్యాభర్తలిద్దరు దూరమయ్యారు... కూతురిని తీసుకుని అత్తారింటినుండి స్వేచ్చ బయటకు వచ్చేసింది. భర్తతో విడిపోయాక కొంతకాలం తల్లిదండ్రులవద్దే ఉన్న స్వేచ్చ తర్వాత కూతురితో కలిసి వేరుగా ఉంటోంది.

45
స్వేచ్చ మృతికి కారణమేంటి?

యాంకర్ గా పనిచేస్తున్న స్వేచ్చకు మీడియా రంగంలోనే పనిచేసే పూర్ణచందర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడి పెళ్లి కాకుండానే కలిసి జీవిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఏమయ్యిందో తెలీదుగానీ స్వేచ్చ శుక్రవారం రాత్రి ఫ్యాన్ కు ఉరేసుకుని ప్రాణాలు వదిలింది.

తమ కూతురు ఆత్మహత్యకు పూర్ణచందర్ కారణమని స్వేచ్చ తండ్రి శంకర్ ఆరోపిస్తున్నారు. స్వేచ్చ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

55
స్వేచ్చ మృతికి కేసీఆర్, కేటీఆర్ సంతాపం

స్వేచ్చ వొటార్కర్ మరణంపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. సామాజిక స్పృహ కలిగిన కవయిత్రిగా, జర్నలిస్టుగా ఎదుగుతున్న స్వేచ్ఛ మరణం విషాదకరమన్నారు. ఆమె ఆకస్మిక మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు కేసీఆర్. 

తెలంగాణ ఉద్యమంలో స్వేచ్ఛ తల్లిదండ్రులు శంకర్, శ్రీదేవిలు చురుకుగా పాల్గొన్నారని.. బిడ్డను కోల్పోయి శోకతప్త హృదయులైన వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు కేసీఆర్.

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్వేచ్చ మరణంపై సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబానికి సానుభూతి తెలియజేసారు. స్వేచ్చ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories