టీపీసీసీకి కొత్త బాస్ ఎవరు?: సీనియర్లకు అధిష్టానం నుండి పిలుపు

Published : May 04, 2021, 10:23 AM IST

టీపీసీసీ చీఫ్ పదవికి కొత్త నేతను ఎంపిక  చేసే విషయమై ఁఆ పార్టీ నాయకత్వం కేంద్రీకరించనుంది. మరో వారం రోజుల తర్వాత ఈ విషయమై పార్టీ నాయకత్వం కీలక సమాలోచనలు చేసే అవకాశం ఉంది

PREV
18
టీపీసీసీకి కొత్త బాస్ ఎవరు?: సీనియర్లకు  అధిష్టానం నుండి పిలుపు

టీపీసీసీకి కొత్త సారధి ఎవరనే విషయమై కాంగ్రెస్ పార్టీలో చర్చ మరోసారి తెరమీదికి వచ్చింది. నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు పూర్తయ్యాయి. దీంతో టీపీసీసీ చీఫ్  పదవి ఎవరిని వరిస్తోందోననే చర్చ సర్వత్రా నెలకొంది. 

28

ఎమ్మెల్సీ, మాజీ మంత్రి జీవన్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ గా  నిర్ణయించారని ప్రచారం సాగింది. నాగార్జునసాగర్ ఎన్నికలు పూర్తి కాగానే  జీవన్ రెడ్డి పేరును ప్రకటించడం లాంఛనమే  అభిప్రాయం కూడ ఆ పార్టీలో నెలకొంది. 

38

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి, మాజీ మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిల పేర్లు కూడ  పీసీసీ చీఫ్ పదవి రేసులో ఉన్నాయి.

48

అయితే  వచ్చే ఎన్నికల నాటికి పార్టీని  నడిపించాల్సిన బాధ్యత పీసీసీ చీఫ్ పై ఉంది. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని నడిపించడంతో పాటు అధికార పార్టీతో పాటు బీజేపీ నుండి వస్తున్న సవాల్ ను సమర్ధంగా తిప్పికొట్టే  శక్తి ఉన్న నేత కోసం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అన్వేషిస్తోంది. 

58

దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయంతో  బీజేపీ రాష్ట్రంలో  కాంగ్రెస్ కు సవాల్ ను విసిరింది., అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జునసాగర్ ఎన్నికల్లో  బీజేపీకి ఆశించిన ఫలితాలు రాలేదు. సాగర్ ఎన్నికల్లో  మాత్రం కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కు గట్టిపోటీ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ కూడ దక్కలేదు.

68

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు కూడ పూర్తయ్యాయి. మరో వారం రోజుల్లో మాణికం ఠాగూర్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. తెలంగాణ పీసీసీకి కొత్త బాస్ ఎంపిక విషయమై పార్టీ అధినాయకత్వంతో ఆయన చర్చించే అవకాశం ఉంది. పీసీసీ చీఫ్ ఎంపిక కోసం మరోసారి అభిప్రాయసేకరణ నిర్వహించే అవకాశం లేకపోలేదనే ప్రచారం సాగుతోంది. 

78

పీసీసీ చీఫ్ ఎంపిక విషయమై పార్టీ సీనియర్లకు అధిష్టానం నుండి పిలుపు వచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు సుమారు నెల రోజులకు పైగా సమయం పట్టే అవకాశం లేకపోలేదు.

88

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,రేవంత్ రెడ్డిలు కూడ ఈ పదవి విషయమ పట్టుదలగా ఉన్నారనే ప్రచారం కూడ లేకపోలేదు. అయితే ఒకరికి పీసీసీ చీఫ్ పదవి, మరొకరికి కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మెన్ పదవిని కట్టబెట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది.  

click me!

Recommended Stories