తాగు నీటిలో కరోనా: సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా

First Published Apr 25, 2021, 2:07 PM IST

తాగు నీటిలో కూడ కరోనా వైరస్ ఉందని సీసీఎంబీ గుర్తించింది.  రెండు రోజుల పాటు వైరస్ జీవించి ఉంటుందని శాాస్త్రవేత్తలు చెప్పారు. 

: తాగునీటిలో కూడ కరోనా వైరస్ రెండు రోజుల పాటు బతికే ఉంటుందని సీసీఎంబీ తేల్చింది. నీటి ఉష్ణోగ్రతతో పాటు అందులోని పదార్ధాలపై వైరస్ బతికే కాలం ఆధారపడి ఉంటుందని సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా తెలిపారు.
undefined
కరోనా వైరస్ ఏ రకంగా వ్యాప్తి చెందుతుందనే విషయాలపై సీసీఎంబీ పలు రకాల పరిశోధనలు చేస్తోంది. ఇందులో భాగంగా తాగు నీటిలో కరోనా వైరస్ ఎంత కాలం బతికి ఉంటుందనే విషయాలపై కూడ పరిశోధనలు నిర్వహించారు.
undefined
సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా సైంటిస్ట్ లు దివ్యతేజ్, కార్తీక్‌లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ లో పలు విషయాలపై మాట్లాడారు.
undefined
4 నుండి 12 డిగ్రీల ఉష్ణోగ్రతల వరకు చల్లని నీటిలో వైరస్‌కు ఇన్‌ఫెక్షన్ కల్గించే సామర్ధ్యం ఉందన్నారు. వేడి నీటిలో 65 డిగ్రీల వద్ద వైరస్ నిమిషాల వ్యవధిలో చనిపోతోందని వారు చెప్పారు.
undefined
వైరస్ ఒక్కటే ఇన్‌ఫెక్షన్ కల్గించదన్నారు. అది శరీరంలోకి వెళ్లాలంటే ప్రత్యేకించి కొన్ని వందల కణాలు కావాల్సి ఉంటుందని చెప్పారు.
undefined
ముందుజాగ్రత్తగా వేడి చేసిన గోరు వెచ్చని నీటిని, వేడి పదార్ధాలను తీసుకోవడం మంచిదని సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వ్యాక్సిన్ తీసుకోవాలని సైంటిస్టులు సూచించారు.
undefined
గతంలో మురుగునీటిలో కూడ కరోనా వైరస్ ను సీసీఎంబీ గుర్తించింది. జీహెచ్ఎంసీ పరిధిలో మురుగు నీటి కేంద్రాల్లో నీటి శాంపిల్స్ ను పరిశీలించారు.
undefined
click me!