మై విలేజ్ షో.. ఈ పేరు వినగానే ముందుగా గంగవ్వ, ఆ తరువాత అనిల్ గుర్తుకువస్తారు. యూట్యూబర్ గా డిఫరెంట్ షో గా గ్రామీణ జీవితాన్ని కళ్లకు కడుతూ వీడియోలు చేస్తే మంచి పేరు తెచ్చుకున్నాడు అనిల్. ఇప్పుడు తన పెళ్లి కార్డు విషయంలోనూ తన క్రియేటివిటీని కొత్త పుంతలు తొక్కించాడు.
undefined
సాధారణంగా ఏ పెళ్లి పత్రిక చూసినా శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు అంటూ మొదలు పెడతారు కానీ ఇది ఈ పెళ్లి పత్రికలో మాత్రం.. శానిటైజర్ ఫస్ట్.. మాస్క్ మస్ట్.. సోషల్ డిస్టెన్స్ బెస్టు.. అని ఉంది. అసలే కరోనా టైంలో పెళ్లి కదా అందుకే ఇలా వినూత్నంగా వెడ్డింగ్ కార్డు ను రూపొందించారు.
undefined
‘వధూవరులకు కరోనా నెగిటివ్, మరవకుండా మీ ఫోన్ లో వన్ జీబీ డేటా ఆగ పట్టుకుని.. పిల్లా- జెల్లా, అయిసోళ్లు - ముసలోళ్ళు.. అందరూ ఫోన్‌ల ముందు అంతర్జాలంలో ఆన్లైన్లో ఆశీర్వదించగలరు.
undefined
విందు లైవ్లో తల్వాలు పడ్డంక... ఎవ్వరింట్ల ఆళ్లు బువ్వ తినుర్రి. బరాత్ ఉంది.. కానీ ఎవరి ఇంట్లో వాళ్ళు పాటలు పెట్టుకుని ఎగురుర్రి. మీరు ఎగిరిన 15 సెకన్ల వీడియో మాకు పంపుర్రి దాన్ని వ్లోగులో పెడతాం.
undefined
ఇక కట్నాలు, కానుకలు గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా క్యూ ఆర్ స్కానర్ చేసి పంపండి. అంటూ రూపొందించిన ఈ ఫన్నీ వెడ్డింగ్ కార్డ్ ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతుంది. ఈ పెళ్లి పత్రిక ప్రముఖ యూట్యూబ్ ఆర్ మై విలేజ్ షో అనిల్ ది. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం దర్గపల్లి గ్రామానికి చెందిన యూట్యూబర్ జీల అనిల్ మే 1న తన వివాహం ఉందని ఈ తంతును అందరూ ఆన్లైన్లో తప్పకుండా వీక్షించాలని కోరుతూ.. కరోనా కాలంలో లగ్గం పత్రిక అంటూ క్రియేటివ్ గా వెడ్డింగ్ కార్డు ను రూపొందించారు.
undefined
అంతేకాకుండా పెళ్లికి సమర్పించే కట్న కానుకలతో కరోనా కాలంలో తిండి లేకుండా బాధపడుతున్న వారికి ఆర్థిక సహాయం అందించబడుతుంది అని పేర్కొన్నారు. మై విలేజ్ షో తో పాపులర్ అయిన అనిల్ కరోనా కాలంలో తాము చేసుకునే పెళ్లి సమాజానికి ఆదర్శంగా నిలవాలని భావించి ఇలా క్రియేటివ్ గా డిజైన్ చేయించారు.
undefined