2025లో సెలవులే సెలవులు : వచ్చేవారం నుండి వరుస లాంగ్ వీకెండ్స్, ఎన్నో తెలుసా?

First Published | Jan 4, 2025, 10:01 PM IST

2025 లో సెలవులే సెలవులు వస్తున్నాయి. అయితే ఈ ఇయర్ లో చాలా సెలవులు శని, ఆదివారాలతో కలిసివచ్చి లాంగ్ వీకెండ్ గా మారుతున్నాయి. ఇలా ఈ సంవత్సరంలో ఎన్ని లాంగ్ వీకెండ్స్ వస్తున్నాయో చూద్దాం. 

 2024 ముగిసింది... 2025 లోకి అడుగుపెట్టాం. ఈ నూతన సంవత్సరంలో కూడా భారీగా సెలవులు వస్తున్నాయి. మరో ఆసక్తికర విషయం ఏంటంటే పండగలు, ప్రత్యేక రోజుల సందర్భంగా వచ్చే సెలవులు వీకెండ్ తో కలిసి వస్తున్నాయి. దీంతో ఈ ఇయర్ లో చాలా లాంగ్ వీకెండ్స్ వస్తున్నాయి. ఇలా తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకే కాదు ఉద్యోగులకు కూడా చాలా లాంగ్ వీకెండ్స్ వస్తున్నాయి. 

ముఖ్యంగా శని, ఆదివారాలు సెలవుండే విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు ఈ సెలవులు కలిసివస్తున్నాయి. అలాగే మల్టీ నేషనల్ కంపనీల్లో పనిచేసే సాప్ట్ వేర్ ఉద్యోగులకు కూడా ఈ సెలవులు కలిసివస్తాయి. ఎందుకంటే వారికి కూడా సాధారణంగా శని, ఆదివారం సెలవులు వుంటాయి. 

ఇలా వీరికి పిల్లలకే కాదు పేరేంట్స్ కు లాంగ్ వీకెండ్స్ వస్తున్న నేపథ్యంలో టూర్స్ కు ప్లాన్ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలో ఈ ఏడాదిలో వచ్చే లాంగ్ వీకెండ్స్ గురించి తెలుసుకుందాం...అందుకు తగినట్లుగా ప్లాన్ చేసుకొండి. 

నెలలవారిగా లాంగ్ వీకెండ్స్ వివరాలు : 

జనవరి 2025 లో లాంగ్ వీకెండ్స్:
 
జనవరి 11 రెండో శనివారం

జనవరి 12 ఆదివారం

జనవరి 13 సోమవారం, భోగి

జనవరి 14 మంగళవారం, సంక్రాంతి 

(వరుసగా నాలుగు రోజుల సెలవులు)

ఫిబ్రవరి 2025 :

ఈ నెలలో పెద్దగా పండగలు, సెలవులు లేవు. అయితే ఐచ్చిక సెలవులు వున్నాయి. మీరు వీటిని లాంగ్ వీకెండ్‌గా మార్చుకోవచ్చు 

మొదటి లాంగ్ వీకెండ్ 

ఫిబ్రవరి 03 సోమవారం, శ్రీపంచమి (ఐచ్చిక సెలవు) 

ఫిబ్రవరి 1 శనివారం

ఫిబ్రవరి 2 ఆదివారం ,

రెండో లాంగ్ వీకెండ్ 

ఫిబ్రవరి 14 శుక్రవారం, షబ్‌-ఈ‌‌-బరాత్ (ఐచ్చిక సెలవు)

ఫిబ్రవరి 15, శనివారం

 ఫిబ్రవరి 16, ఆదివారం
 
 


మార్చి 2025 :

మొదటి లాంగ్ వీకెండ్

మార్చి 14, శుక్రవారం, హోలి పండగ

మార్చి 15, శనివారం

మార్చి 16, ఆదివారం

రెండో లాంగ్ వీకెండ్

మార్చి 21, శుక్రవారం - షహదత్  హజ్రత్ అలి (ఐచ్చిక సెలవు) 

మార్చి 22, శనివారం 

మార్చి 23,  ఆదివారం 

మూడో లాంగ్ వీకెండ్

మార్చి 28 శుక్రవారం, జుమాతుల్-వద OR షబ్-ఈ-ఖాదర్ (ఐచ్చిక సెలవు)

మార్చి 29, శనివారం

మార్చి 30, ఆదివారం (ఉగాది)

మార్చి 31, సోమవారం: ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్)

ఏప్రిల్ 1, మంగళవారం, రంజాన్ తర్వాతి రోజు సెలవు 

(వరుసగా ఐదురోజుల సెలవు)
  
 ఏప్రిల్ 2025 : 

మొదటి లాంగ్ వీకెండ్

 ఏప్రిల్ 12 శనివారం 

ఏప్రిల్ 13 ఆదివారం   

ఏప్రిల్ 14 సోమవారం, డాక్టర్ అంబేద్కర్ జయంతి 

రెండో లాంగ్ వీకెండ్

ఏప్రిల్ 18 శుక్రవారం: గుడ్ ఫ్రైడే

ఏప్రిల్ 19 శనివారం

ఏప్రిల్ 20 ఆదివారం 
 

మే 2025 :

మే 10 శనివారం 

మే 11 ఆదివారం 

మే 12 సోమవారం, బుద్ధ పూర్ణిమ (ఐచ్ఛిక సెలవు)  

 జూన్ 2025 :

జూన్ 27 శుక్రవారం, రథ యాత్ర (ఐచ్చిక సెలవు)

జూన్ 28 శనివారం 

జూన్ 29 ఆదివారం 

ఆగస్ట్ 2025 :

మొదటి లాంగ్ వీకెండ్

ఆగస్ట్ 8 శుక్రవారం ‌- వరలక్ష్మి వ్రతం(ఐచ్చిర సెలవు)

ఆగస్ట్ 9 శనివారం 

ఆగస్ట్ 10 ఆదివారం 

రెండో లాంగ్ వీకెండ్

ఆగస్టు 15 శుక్రవారం ‌- స్వాతంత్ర్య దినోత్సవం

ఆగస్టు 16 శనివారం: జన్మాష్టమి (ఐచ్చిక సెలవు)

ఆగస్టు 17 ఆదివారం

మూడో లాంగ్ వీకెండ్

ఆగష్టు 27 బుధవారం - గణేష్ చతుర్థి  

ఆగష్టు 28, ఆగస్ట్ 29 గురు, శుక్రవారం సెలవు తీసుకుంటే
 
ఆగస్ట్ 30 శనివారం 

ఆగస్ట్ 31 ఆదివారం
 

సెప్టెంబరు 2025 : 

సెప్టెంబరు 5 శుక్రవారం: ఈద్-ఇ-మిలాద్ 

సెప్టెంబర్ 6, శనివారం

సెప్టెంబర్ 7, ఆదివారం

అక్టోబర్ 2025 :

సెప్టెంబర్ లో బతుకమ్మ, అక్టోబర్ లో దసరా సందర్భంగా భారీ సెలవులు వస్తాయి. 

అక్టోబర్ 2 గురువారం - దసరా

అక్టోబర్ 3 శుక్రవారం : దసరా తర్వాతిరోజు సెలవు 

అక్టోబర్ 4 శనివారం 

అక్టోబర్ 5 ఆదివారం

రెండొ లాంగ్ వీకెండ్

అక్టోబర్ 18 శనివారం

అక్టోబర్ 19 ఆదివారం

అక్టోబర్ 20 సోమవారం: దీపావళి

డిసెంబర్ 2025 :

డిసెంబర్ 25 గురువారం: క్రిస్మస్ 

డిసెంబర్ 26 శుక్రవారం : క్రిస్మస్ తర్వాతి రోజు

డిసెంబర్ 27 శనివారం 

డిసెంబర్ 28 ఆదివారం
 

Latest Videos

click me!