Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతి పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రెండు రోజుల కిందట తిరుమల సందర్శించారు. ఆ సమయంలో ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజకీయాల్లో తనకు నచ్చని అంశం ఇదేనని పేర్కొంది. అదేంటంటే.?
బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరణ ఎదుర్కున్న తర్వాత కల్వకుంట్ల కవిత.. తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే త్వరలోనే జిల్లాల యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు కవిత.
25
ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు..
తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న కల్వకుంట్ల కవిత ఏపీ రాజకీయాలపై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకు ఓ విషయం నచ్చడం లేదని.. ఇక్కడ నాయకుల మాట్లాడే విధానం సరిగ్గా లేదని ఆమె అన్నారు.
35
రెచ్చగొట్టే వ్యాఖ్యలు నచ్చట్లేదు..
ఏపీలోని రాజకీయ నాయకులు ఒకరినొకరు తీవ్రంగా దూషించుకుంటారు. రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు, దుర్భాషలాడటం, అలాగే ఒకరినొకరు తీవ్రంగా అవమానించుకోవడాన్ని ఆమె ఎత్తి చూపించారు. ఇక్కడి నాయకులు ఒకరినొకరు వ్యక్తిగతంగా బాధపెట్టుకోవడానికి ప్రయత్నించడం తనకు ఇష్టం లేదని కవిత అన్నారు.
ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు తాను చేసిన ఒక్క ఫోన్ కాల్ ద్వారానే బీసీ మైనారిటీ సమస్యను క్షణాల్లో పరిష్కరించారన్నారు కవిత. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయకత్వ లక్షణాలపై కల్వకుంట్ల కవిత ప్రశంసలు కురిపించారు. త్వరలోనే తెలంగాణలోని ప్రతి జిల్లాలోనూ పర్యటిస్తానని కవిత అన్నారు. తాను బలమైన స్వతంత్ర వ్యక్తిత్వం కలిగి ఉంటానని, త్వరలోనే తెలంగాణ రాజకీయాల్లో తన ప్రభావం చూపిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు కవిత.
55
వైసీపీ నాయకుల రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
కల్వకుంట్ల కవిత ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక కారణం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొడాలి నాని, రోజా లాంటి నాయకులు తరచూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడమే కాదు.. ఇతర నాయకులపై దుర్భాషలాడిన సందర్భాలు లేకపోలేదు.