ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం.. శుక్రవారం, శనివారం రాష్ట్రంలో ఆకాశం మొత్తం మబ్బులు పట్టి ఉంటుంది. జూలై 10న పగలు, రాత్రి సమయాల్లో అక్కడక్కడా చిన్నపాటి జల్లులు పడే ఛాన్స్ 10 శాతం వరకు ఉంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 37 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది.
అయితే ఉత్తరాంధ్ర జిల్లాలు, కోనసీమ, ఏలూరు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చు. మిగిలిన చోట్ల లైట్‌గా వానలు పడతాయి. కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయి.