వాతావరణ నిపుణుల విశ్లేషణ ప్రకారం ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వేడి ప్రభావం అధికంగా ఉండనుంది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, గద్వాల ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36–40 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశముంది.
అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న ములుగు, భూపాలపల్లి, కొత్తగూడెం ప్రాంతాల్లో కూడా ఎండ తీవ్రత అధికంగా ఉండవచ్చని హెచ్చరికలు జారీ చేశారు. మిగతా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల కంటే తక్కువగా ఉన్నా జాగ్రత్తలు తప్పనిసరి అని అధికారులు చెబుతున్నారు.