Telangana Weather Update : తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు హైదరాబాద్ లోనే నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ ను మించిపోయేలా నగరంలో రికార్డు స్థాయిలో టెంపరేచర్స్ పడిపోతున్నాయి.
Hyderabad Weather : తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోతున్నాయి... చలి తారాస్థాయికి చేరుకుంది. తెలంగాణలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి... ఏపీలో అయితే 3 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్చ్ నమోదవుతున్నాయి. టెంపరేచర్స్ మరికొన్నిరోజులు ఇలాగే తగ్గుతూ ఉంటాయని వాతావరణ విభాగాలు హెచ్చరిస్తున్నాయి... దీంతో కొంపదీసి మైనస్ డిగ్రీస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయేమోనని తెెలుగు ప్రజలు కంగారుపడిపోతున్నారు.
25
తెలంగాణలో వింత వాతావరణం
తెలంగాణ వింత పరిస్థితి నెలకొంది. సాధారణంగా ప్రతిసారి అత్యల్ప ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ లో నమోదవుతాయి. ఆ తర్వాత ఏ మెదక్, సంగారెడ్డి లోనో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉంటాయి. కానీ ఈసారి విచిత్రంగా ఆదిలాబాద్ తర్వాత అత్యల్ప టెంపరేచర్స్ హైదరాబాద్ (GHMC పరిధి) లో నమోదవుతున్నాయి. దీన్నిబట్టి హైదరాబాద్ లో చలి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కాంక్రీట్ జంగిల్ లో కీకారణ్యంలో మాదిరి చలిగాలులు వీస్తున్నాయి... దీంతో నగర ప్రజలు ఇళ్లలోంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.
35
హైదరాబాద్ లో లోయెస్ట్ టెంపరేచర్స్
ఇవాళ (గురువారం, డిసెంబర్ 11) అత్యల్పంగా ఆదిలాబాద్ లో 6.2 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. దీనికి పోటీనిచ్చేలా హైదరాబాద్ లో 6.4 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలున్నాయి. పటాన్ చెరు ఈక్రిశాట్ ప్రాంతంలో ఈస్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయి అత్యంత చలి వాతావరణం ఉంది. ఇక నగరంలోని రాజేంద్ర నగర్ లో 8.5, హయత్ నగర్ లో 10 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్స్ నమోదయ్యాయి.
జిల్లాలవారిగా చూసుకుంటే ఆదిలాబాద్ తర్వాత అత్యల్ప ఉష్ణోగ్రతలు మెదక్ లో 7.2 డిగ్రీ సెల్సియస్ ఉన్నాయి. అలాగే హన్మకొండలో 8.6, రామగుండంలో 10.6, నిజామాబాద్ లో 11.4 డిగ్రీల టెంపరేచర్స్ నమోదయ్యాయి. ఇవాళ్టినుండి చలిగాలులు మరింతగా పెరిగి ఉష్ణోగ్రతలు పడిపోతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
55
తెలంగాణలో మరింత దిగువకు టెంపరేచర్స్
రాబోయే మూడునాలుగు రోజులు తెలంగాణలోని 14 జిల్లాల్లో 5 నుండి 10 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, కొమ్రంభీ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలుంటాయని హెచ్చరించింది... ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లోనూ 10 నుండి 15 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.