వరంగల్ లో అత్యుత్తమ నెట్ వర్క్ కలిగిన టెలికాం సంస్థ ఏది…? హైస్పీడ్ ఇంటర్నెట్, నాణ్యమైన వాయిస్ కాల్ ఆధారంగా ఇటీవల ట్రాయ్ ఈ ఆసక్తికర సమాచారాన్ని బైటపెట్టింది.
Warangal : ఇండియాలో డిజిటల్ విప్లవానికి నాంది పలికింది ఎవరంటే టక్కున రిలయన్స్ జియో పేరు వినిపిస్తుంది. జియో ఎంట్రీతో ఇంటర్నెట్ సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చింది... ఇప్పుడిది నిత్యావసరం అయిపోయింది. అయితే ఇప్పుడు కేవలం పెద్దపెద్ద నగరాల్లోనే కాదు టైర్ 2 సిటీస్, మారుమూల పల్లోల్లో కూడా సేవలను మరింత మెరుగుపర్చుకుంటోంది. ఇందులో భాగంగానే వరంగల్ లో అత్యుత్తమ నెట్ వర్క్ గా జియో ప్రత్యేక గుర్తింపు పొందింది.
24
వరంగల్ లో జియో 5G ఆధిపత్యం...
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఇటీవల వరంగల్ లో ప్రత్యేక టెస్ట్ డ్రైవ్ నిర్వహించింది. నగరంలో 5G సేవలను ఏ నెట్ వర్క్ మెరుగ్గా అందిస్తుందో తెలుసుకునేందుకు ఇది చేపట్టారు. ఇందులో రిలయన్స్ జియో సత్తా చాటింది... డేటా వేగం, వాయిస్ నాణ్యత, లేటెన్సీ, బలమైన సిగ్నల్ ఇలా అన్ని టెస్టుల్లోనూ టాప్ లేపింది. ఇతర టెలికాం సంస్థల కంటే జియో ముందంజలో ఉందని ట్రాయ్ రిపోర్ట్ తెలిపింది.
వరంగల్ లోని ముఖ్యమైన ప్రాంతాల్లో ట్రాయ్ సిగ్నల్ టెస్ట్ చేపట్టింది. ఇందులో జియో 5G అత్యధిక డౌన్ లోడ్ వేగం, సిగ్నల్ అంతరాయం లేకుండా కాల్ కనెక్టివిటీ కలిగివుంది. ఇది జియో నెట్ వర్క్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తోందని తెలియజేస్తోంది.
34
వరంగల్ జియో డౌన్లోడ్ వేగం ఎంత..?
ట్రాయ్ రిపోర్ట్ ప్రకారం... వరంగల్ లో జియో 5G డౌన్లోడ్ వేగం అద్బుతంగా ఉంది. నగరంలో ఏకంగా 260.01 Mbps డౌన్లోడ్ వేగం ఉందని తేలింది. అయితే డౌన్లోడ్ స్పీడ్ విషయంలో పోటీ సంస్థలు ఎయిర్ టెల్, వొడాఫోన్ చాలా వెనకబడి ఉన్నాయి. ఎయిర్ టెల్ డౌన్లోడ్ వేగం కేవలం 161.18 Mbps మాత్రమే... వొడాఫోన్ మరీ దారుణంగా 27.83 Mbps ఉంది. ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ డౌన్లోడ్ వేగం కేవలం 8.32 Mbps మాత్రమే.
వరంగల్ నగరంలోని కొన్ని ప్రధాన ప్రాంతాల్లో జియో 5G స్పీడ్ మరింత ఎక్కువగా నమోదయ్యింది. హన్మకొండ బస్టాండ్ వద్ద 471.60 Mbps ఇంటర్నెట్ స్పీడ్ ఉంది... ఇక రెడ్డి కాలనీలో కూడా 456.67 Mbps స్పీడ్ ఉంది. ఇలా నగరంలోని అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్ స్పీడ్ ఇదే స్థాయిలో ఉందని ట్రాయ్ రిపోర్ట్ చెబుతోంది.
తెలంగాణలో ఇంటర్నెట్ వేగంలోనే కాదు వాయిస్ కాల్ నాణ్యతలోనూ జియో టాప్ లో నిలిచింది. మీన్ ఒపీనియన్ స్కోరు (ఆడియో, వీడియో లేదా వాయిస్ కమ్యూనికేషన్ నాణ్యతను అంచనా వేయడానికి ఉపయోగించే రేటింగ్ స్కేల్) కూడా జియోదే మెరుగ్గా ఉంది. అత్యుత్తమ స్కోరు 5 అయితే జియో స్కోరు 4.46 గా నమోదయ్యింది. ఇక ఎయిర్ టెల్ 3.98, వొడాఫోన్ ఐడియా 3.76, బిఎస్ఎన్ఎల్ 2.98 స్కోరు సాధించాయి. అంటే జియో నెట్ వర్క్ ఉపయోగించే వినియోగదారులకు వాయిస్ కాల్ సమస్యలు లేదని అర్థమవుతోంది.
ప్రస్తుతం ప్రభుత్వం పట్టణాల్లోనే కాదు పల్లెల్లో కూడా డిజిటల్ సేవలను మరింత మెరుగుపర్చే లక్ష్యంతో ముందుకు వెళుతోంది. ఈ క్రమంలోనే రిలయన్స్ జియో తమ సేవలను గ్రామీణ ప్రాంతాల్లో మెరుగుపరుస్తోంది.. ఇందుకు నిదర్శనమే వరంగల్ టెస్ట్ డ్రైవ్ రిపోర్ట్. కేవలం వరంగల్ లోనే కాదు తెలంగాణలోని మిగతా ప్రాంతాల్లో కూడా జియో సేవలు ఇదే స్థాయిలో ఉన్నాయని ఆ కంపెనీ బలంగా చెబుతోంది.