25 ఏళ్ల క్రితం కలిసిన ఫ్రెండ్ కోసం కేరళ నుంచి తెలంగాణకు వచ్చిన వ్యక్తి.. ఎందుకో తెలిస్తే హ్యాట్సాఫ్ చెప్తారు

Published : Jul 10, 2026, 10:07 PM IST

Viral News: అప్పు తీసుకుని తిరిగి ఇవ్వకుండా తప్పించుకునే సంద‌ర్భాలు చూసి ఉంటాం. అయితే 25 ఏళ్ల క్రితం తీసుకున్న అప్పును మ‌రిచిపోకుండా వంద‌ల కిలోమీట‌ర్లు ప్ర‌యాణించి అప్పు తీర్చుకున్న ఓ వ్య‌క్తి క‌థ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 

PREV
14
సౌదీ అరేబియాలో మొదలైన స్నేహం..

కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన మహ్మద్ ఇస్మాయిల్, జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన ఎడ్ల లచ్చన్నతో కలిసి సుమారు 25 ఏళ్ల క్రితం సౌదీ అరేబియాలో ఉద్యోగం చేశారు. ఆ సమయంలో వ్యక్తిగత అవసరం రావడంతో ఇస్మాయిల్ తన స్నేహితుడు లచ్చన్న వద్ద నుంచి రూ.25,000 అప్పుగా తీసుకున్నాడు. భారత్‌కు వచ్చిన తర్వాత తప్పకుండా తిరిగి ఇస్తానని మాట కూడా ఇచ్చాడు.

24
పరిస్థితుల కారణంగా అప్పు తీర్చలేకపోయాడు

భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత జీవితం అనేక మలుపులు తిరిగింది. పరిస్థితుల కారణంగా ఇస్మాయిల్ తన స్నేహితుడిని కలవలేకపోయాడు. సంప్రదించడానికి ఫోన్ నంబర్ లేదు.. చిరునామా లేదు.. కాలక్రమంలో ఇద్దరూ పూర్తిగా దూరమయ్యారు. అయినా కూడా తీసుకున్న అప్పు మాత్రం ఆయన మనసులో నుంచి పోలేదు. ఎప్పటికైనా ఆ డబ్బు తిరిగి ఇవ్వాలనే ఆలోచనే ఆయనను వెంటాడింది.

34
ధర్మపురి పేరు మాత్రమే తెలుసు

ఇస్మాయిల్‌కు గుర్తున్నది ఒక్కటే.. తన స్నేహితుడు తెలంగాణలోని జగిత్యాల జిల్లా ధర్మపురి వాసి అన్న విషయం. అదే ఆధారంగా ఇంటర్నెట్‌లో వెతికాడు. ఆ తర్వాత కేరళ నుంచి తెలంగాణకు ప్రయాణమయ్యాడు. ధర్మపురికి చేరుకున్నాక స్థానికులను అడుగుతూ చివరకు లచ్చన్న ఇంటిని గుర్తించాడు.

ల‌చ్చ‌న్న‌కు ఫోన్ కాల్

ప్రస్తుతం లచ్చన్న గల్ఫ్ దేశంలో ఉద్యోగం చేస్తున్నాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనకు ఫోన్ చేశారు. మొదట ఇస్మాయిల్ పేరు వినగానే లచ్చన్న ఆనందంతో ఉప్పొంగిపోయాడు. అప్పుగా ఇచ్చిన డబ్బు విషయం ఆయనకు గుర్తు లేకపోయినా, తన పాత స్నేహితుడిని మాత్రం వెంటనే గుర్తుపట్టాడు. ఇద్దరూ ఫోన్‌లో పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.

44
రూ.25 వేలు తిరిగి ఇచ్చి.. మనసులోని భారం దించుకున్న ఇస్మాయిల్

ఆ తర్వాత ఇస్మాయిల్ తన స్నేహితుడు లచ్చన్న కుటుంబ సభ్యులకు రూ.25,000 అందజేశాడు. ఇన్నేళ్లుగా మనసులో ఉన్న బాధ ఇప్పుడు తీరిందని, ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగాననే సంతోషం తనకు ఎంతో ప్రశాంతత ఇచ్చిందని చెప్పాడు. ఈ ఘటన స్థానికంగా అందరినీ కదిలించింది. నిజాయితీ, స్నేహం, మాటకు విలువ ఇంకా ఈ సమాజంలో బతికే ఉన్నాయని మహ్మద్ ఇస్మాయిల్ నిరూపించాడని పలువురు ప్రశంసిస్తున్నారు. డబ్బు కంటే విలువైనది నమ్మకం.. కాలం ఎంత మారినా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే నిజమైన మనిషి గొప్పతనం అని ఈ సంఘటన మరోసారి గుర్తు చేసింది.

Read more Photos on
click me!

Recommended Stories