రాజన్న దర్శనానికి సర్వం సిద్దం...ఆలయ ప్రాంగణంలో పాటించాల్సిన జాగ్రత్తలివే

First Published Jun 6, 2020, 9:18 PM IST

వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం జూన్ 8వ తేదీన తిరిగి ప్రారంభం కానుంది. 

రాజన్నసిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో వెలిసిన రాజరాజేశ్వర స్వామి దాదాపు 80 రోజుల తర్వాత భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్రభత్వ అనుమతులకు లోబడి రాజన్న దర్శనానికి భక్తులను ఈనెల 8వ తేదీ సోమవారం నుండి అనుమతిస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. శనివారం వేములవాడ ఆలయ ఏఈవో ఆలయ అధికారులు, సిబ్బందితో సమావేశమై 8వ తేదీ నుండి ఆలయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించారు. ఈ సమావేశానికి ఆలయ కార్యనిర్వహణాధికారి హాజరుకాలేదు.
undefined
65 ఏళ్ల వయసు కలిగిన వృద్దులకు, గర్భిణీలకు, పదేళ్ల లోపు చిన్నారులకు స్వామివారి దర్శనానికి అనుమతి లేదని తెలిపారు. కోడెల క్యూ కాంప్లెక్స్ ద్వారా స్వామివారి దర్శనానికి భక్తులకు అనుమతించి... ఆలయంలోని దక్షిణ ద్వారం నుండి భక్తులు బయటకు వెళ్లేందుకు ఏర్పాట్లుచేశారు.
undefined
ప్రతి భక్తుడికి లఘు దర్శనం మాత్రమే అనుమతి వుంటుందని... శాశ్వత , ఇతర ఆర్జిత పూజలు రద్దు చేయబడినట్లు తెలిపారు. కోడెమొక్కులు, స్వామివారి గర్భాలయంలో భక్తులచే నిర్వహించే పూజలు, తలనీలాలు, కళ్యాణాలు ఇతరత్రా వాటిని రద్దు చేసిన ఆలయ అధికారులు తెలిపారు. ధర్మగుండంలో పుష్కర స్నానాలు రద్దు చేసినట్లు తెలిపారు.
undefined
స్వామి వారికి నిత్య పూజలు యధావిధిగా కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే భక్తులకు అనుమతివ్వనున్నట్లు తెలిపారు. ఇలా రోజుకు 2400 మంది భక్తులకు మాత్రమే అనుమతి వుంటుందన్నారు. ఇలా గంటకు 200 మంది భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతినివ్వనున్నట్లు అధికారులు తెలిపారు.
undefined
మాస్కు ధరించిన భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతివ్వనున్నట్లు తెలిపారు. భక్తుల మధ్య 6 అడుగుల భౌతిక దూరం ఉండే విధంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రెండు గంటలకు ఒకసారి క్యూలైన్లను శానిటేషన్ చేసేలా సిబ్బందికి ఆదేశించారు. ప్రతి భక్తుని థర్మల్ స్క్రీనింగ్ చేయడమే కాకుండా చేతులు, కాళ్లు శుభ్రపరుచుకున్నాకే దేవాలయంలోకి అనుమతివుంటుందన్నారు. ఎలాంటి లక్షణాలు లేని వారిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తామన్నారు.
undefined
భక్తులకు అందుబాటులో లడ్డూ ప్రసాదాలు వుంచనున్నట్లు తెలిపారు. రాజన్న సన్నిధికి వచ్చే భక్తులకు వసతి గదులు కేటాయింపు రద్దు చేశామన్నారు. కరోనా సమయంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటుచేసిన ఆన్ లైన్ పూజలను యధావిధిగా కొనసాగిస్తామని అధికారులు వెల్లడించారు. భౌతికంగా హాజరు మాత్రం అనుమతించబోమని అన్నారు. కరోనా వైరస్ నియంత్రణ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు మైక్, ఎల్ఈడి స్క్రీన్ ల ద్వారా విస్తృత ప్రచారంచేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
undefined
click me!