Vegetable Price : హైదరాబాద్ వీకెండ్ మార్కెట్స్ లో కూరగాయల ధరలివే..

Published : Feb 13, 2026, 11:02 AM IST

Vegetable Prices in Hyderabad : హైదరాబాద్ లో ప్రస్తుతం కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకొండి. నగరవాసులకు ఉపయోగకరంగా ఉండేలా మార్కెట్లో కూరగాయల ధరలకు సంబంధించిన ఫుల్ లిస్ట్ ఇదిగో…

PREV
15
కూరగాయల ధరలు

vegetable prices in Hyderabad : ప్రస్తుతం సామాన్య ప్రజలపై కూరగాయల భారం పెద్దగా లేదు... ఎందుకంటే చాలా ధరలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ వీకెండ్ మార్కెట్స్ లో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

25
టమాటా ధర ఎంత..?

ప్రతి తెలుగువారి వంటింట్లో తప్పకుండా ఉండే కూరగాయ టమాటా. ప్రస్తుతం దీన్నిధర రోజురోజుకు తగ్గిపోతోంది. హైదరాబాద్ మార్కెట్ లో కిలో టమాటా ధర రూ.10 నుండి రూ.20 గా ఉంది. ఇక కొందరు వ్యాపారులు టమాటాలను ఆటోలో ఇంటివద్దకే తీసుకువచ్చి అమ్ముతున్నారు... వీరివద్ద మరింత తక్కువ ధరకే లభిస్తున్నాయి.

35
ఉల్లిపాయల ధర ఎంత..?

ఉల్లిపాయల ధర చాలాకాలంగా స్థిరంగా ఉంది... ఇప్పుడు కూడా రూ.20 నుండి రూ.25 కి కిలో లభిస్తోంది. అయితే నాణ్యతను బట్టి ధర కాస్త అటుఇటుగా ఉండవచ్చు. వీకెండ్ మార్కెట్స్ లో రూ.100 కు ఐదారు కిలోల ఉల్లిపాయలు లభిస్తాయి. హైదరాబాద్ వంటి నగరాల్లో చిన్నసైజు ఉల్లిపాయలకు మంచి డిమాండ్ ఉంటుంది... అందుకే వీటి ధర కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది.

45
మిగతా కూరగాయల ధరలు

పచ్చిమిర్చి కిలో రూ.70-80

చిక్కుడు కిలో రూ 30-40

బీట్ రూట్ కిలో రూ.20-30

ఆలుగడ్డ కిలో రూ.20-25

క్యాప్సికం కిలో రూ.60-70

కాకరకాయ కిలో రూ.35-40

సొరకాయ కిలో రూ.30-35

బీన్స్ కిలో రూ.30-40

క్యాబేజీ కిలో రూ.10-15

క్యారెట్ కిలో రూ.30-35

వంకాయలు కిలో రూ.20-30

బెండకాయలు కిలో రూ.40-50

బీరకాయ కిలో రూ. 20-30

దొండకాయ కిలో రూ.45-50

55
ఆకుకూరల ధరలు

పాలకూర కిలో రూ.30-40 (సైజుని బట్టి రూ.5-10 కట్ట ధర ఉంది)

పూదీనా రూ.5-10 కట్ట

కరివేపాకు రూ.5-10 కట్ట (కిలో రూ.120)

కొత్తిమీర రూ.20 కట్ట, చిన్న కట్ట రూ.10 (కిలో రూ.130 వరకు ఉంది)

మెంతి కూర రూ.10 కి కట్ట

చామకూర కిలో రూ.20 లభిస్తున్నాయి.

గమనిక : ఈ కూరగాయాలు, ఆకుకూరల ధరలు సూపర్ మార్కెట్లు, షాపులు, రైతుబజార్లు, వారాంతం సంతలు జరిగే ఏరియాను బట్టి మారుతుంటాయి... ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి.

Read more Photos on
click me!

Recommended Stories