తెలంగాణలో వరుస సెలవులు..
Lovers Day 2026 : లవర్స్ డే కు సెలవు ఇవ్వడమేంటని అనుకుంటున్నారా..? మీరు చదివేది నిజమే... కానీ ప్రేమికుల రోజు కోసమే సెలవులేమీ ఇవ్వడంలేదు... వేరువేరు కారణాలతో వచ్చే సెలవులు కలిసివస్తున్నాయి. తెలంగాణలో ఫిబ్రవరి 14 కు ముందు, తర్వాత సెలవులు వస్తున్నాయి... కాబట్టి ప్రేమికులు వాలెంటైన్స్ డే ని మరింత ప్రత్యేకంగా ప్లాన్ చేసుకోవచ్చు.
తెలంగాణలో రేపటి నుండి (ఫిబ్రవరి 11, బుధవారం) నుండి వరుస సెలవులు రానున్నాయి. ఫిబ్రవరి 11, 13,14, 15 నాల్రోజులు సెలవులే... ఏ రోజు, ఎందుకు హాలిడే వస్తోందో ఇక్కడ తెలుసుకుందాం.