ఉత్తమ్ కుమార్ రెడ్డి
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నిరుద్యోగ సభల విషయమై ప్రకటన చేయడాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుబట్టారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి
తనకు సమాచారం ఇవ్వకుండానే తన నియోజకవర్గంలోని మహాత్మాగాంధీ యూనివర్శిటీలో నిరుద్యోగ సభ నిర్వహించడాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుబట్టారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రేకు ఫిర్యాదు చేశారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఈ నెల 21న నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్శిటీలో నిరుద్యోగ సభను నిర్వహించనున్నట్టుగా రేవంత్ రెడ్డి నిన్న ప్రకటించారు. ఈ విషయమై తనతో చర్చించకపోవడంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి
పార్టీ కార్యక్రమాల నిర్వహణ విషయమై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరుపై పార్టీ సీనియర్లు గతంలో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి వ్యవహరశైలిపై సీనియర్లు మండిపడ్డారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి
సీనియర్లంతా రేవంత్ రెడ్డి తీరుపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అంతేకాదు వరుసగా సమావేశాలు నిర్వహించారు. దీంతో పార్టీ నాయకత్వం దిగ్విజయ్ సింగ్ ను రాష్ట్రానికి పంపింది. సీనియర్లుతో పాటు అందరితో దిగ్విజయ్ సింగ్ చర్చించారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి
సమస్యలుంటే పార్టీ అంతర్గత వేదికల్లో మాత్రమే చర్చించాలని దిగ్విజయ్ సింగ్ సూచించారు. ఏమైనా సమస్యలుంటే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని కూడా సూచించారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి
గతంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జీగా ఉన్న మాణికం ఠాగూర్ స్థానంలో మాణిక్ రావు ఠాక్రేను పార్టీ నాయకత్వం నియమించింది. మాణిక్ రావు ఠాక్రే రాష్ట్రంలో పార్టీ నేతలను ఏకతాటిపైకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి
అయితే నిరుద్యోగ సభల విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చించకుండానే మహాత్మాగాంధీ యూనివర్శిటీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయమై రేవంత్ రెడ్డి ఏ రకంగా స్పందిస్తారో చూడాలి.
ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాష్ట్రంలో ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జగరనున్నాయి. పార్టీ నేతలు తమ ఆధిపత్యం కోసం ప్రయత్నం చేయడం ప్రత్యర్దులకు రాజకీయంగా అవకాశాలు కల్పించేందుకు దోహదం చేసే అవకాశం ఉందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు