లోకసభ ఎన్నికల్లో కేసీఆర్ కు షాక్: ఇద్దరు మంత్రులపై వేటు?

First Published May 25, 2019, 12:03 PM IST

హైదరాబాద్: లోకసభ ఫలితాలపై తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రులపై ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. ఇద్దరు మంత్రులపై వేటు వేసే దిశగా ఆయన ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. 

హైదరాబాద్: లోకసభ ఫలితాలపై తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రులపై ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. ఇద్దరు మంత్రులపై వేటు వేసే దిశగా ఆయన ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
undefined
జూన్ చివరి వారంలో కేసిఆర్ రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశాలున్నట్లు సమాచారం. ప్రస్తుత మంత్రివర్గ సభ్యుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే మరో ఆరుగురిని ఆయన తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇద్దరు మంత్రులపై వేటు వేసి ఎనిమిది మందిని ఆయన మంత్రివర్గంలోకి తీసుకుంటారని అంటున్నారు.
undefined
ఆశీస్సులు తీసుకోవడానికి తన వద్దకు వచ్చిన కొద్ది మంది కొత్త లోకసభ సభ్యులను ఆయన కలవడానికి కూడా నిరాకరించినట్లు తెలుస్తోంంది. అంతే కాకుండా, ఓటమికి గల కారణాలను వివరించడానికి ప్రగతి భవన్ కు వచ్చిన మంత్రులను కూడా ఆయన కలవడానికి ఇష్టపడలేదని అంటున్నారు.
undefined
లోకసభ ఎన్నికల్లో హైదరాబాదు సీటును వదిలేసి మిగతా 16 సీట్లను గెలుచుకోవాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యతను ఆయా జిల్లా మంత్రులకు అప్పగించారు. 16 సీట్లను లక్ష్యంగా పెట్టుకుంటే కేవలం 9 సీట్లలోనే విజయం సాధించడం ఆయనకు మింగుడు పడడం లేదని అంటున్నారు. పైగా తన కూతురు కల్వకుంట్ల కవిత కూడా నిజామాబాద్ లో ఓడిపోవడం తీవ్ర నిరాశకు గురి చేసినట్లు సమాచారం.
undefined
జిల్లాలోని రెండు పార్లమెంటు సీట్లను కూడు గెలిపించి కానుకగా ఇస్తానని ఓ మంత్రి హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. అయితే, రెండు సీట్లను కూడా టీఆర్ఎస్ కోల్పోయింది. డిసెంబర్ లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో సాధించిన ఘన విజయం లోకసభ ఎన్నికల్లోనూ పునరావృతమవుతుందని కేసీఆర్ భావించారు. అయితే, నాలుగు నెలల కాలంలోనే పరిస్థితి ఎదురు తిరిగింది.
undefined
రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి నిజామాబాద్ లోకసభ సీటు బాధ్యతలు అప్పగించారు. నల్లగొండ, భువనగిరి సీట్లలో పార్టీని గెలిపించే బాధ్యతను విద్యా శాఖ మంత్రి జగదీష్ రెడ్డికి అప్పగించారు. ఈ మూడు సీట్లను కూడా టీఆర్ఎస్ కోల్పోయింది.
undefined
దేవాదాయ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డికి ఆదిలాబాద్ బాధ్యతలు, సీనియర్ మంత్రి ఈటెల రాజేందర్ కు కరీంనగర్ బాధ్యతలు అప్పగించింది. ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని, నియోజకవర్గాల్లోనే ఉండాలని, కేటీఆర్ తో సమన్వయం చేసుకోవాలని సూచించారు
undefined
మల్కాజిగిరి టికెట్ ను మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డికి, సికింద్రాబాదు సీటును తలసాని శ్రీనివాస యాదవ్ కుమారుడు సాయి కిరణ్ యాదవ్ కు ఇచ్చారు. సికింద్రాబాదు టికెట్ సాయికి ఇవ్వడానికి కేసీఆర్ ఇష్టపడలేదని అంటారు. అయితే, తాను గెలిపించుకుని వస్తానని తలసాని శ్రీనివాస యాదవ్ హామీ ఇచ్చి గట్టిగా పట్టుబట్టడంతో ఇవ్వక తప్పలేదని అంటున్నారు. ఈ రెండు సీట్లను కూడా టీఆర్ఎస్ కోల్పోయింది.
undefined
click me!