ఇక, నల్గొండ బస్టాండ్‌లో ఉన్న స్టాల్స్‌ను పరిశీలించారు. అందులో అమ్ముతున్న తినుబండరాలను కూడా పరిశీలించారు. అంతేకాకుండా బస్టాండ్ ఆవరణలో మొక్కలు నాటారు. బస్టాండ్ ఆవరణలో ఉన్న బస్సులను కూడా పరిశీలించారు. అలాగే నల్గొండ రీజియన్ ఆర్టీసీ అధికారులతో సజ్జనార్ సమావేశమయ్యారు. అలాగే ఆర్టీసీకి సంబంధించిన కార్గో సేవలను కూడా ఆయన ఈ సందర్భంగా సజ్జనార్ పరిశీలించారు. సజ్జనార్ ఇలా చేయడం చూసిన నెటిజన్లు.. ఆయన చర్యలను ప్రశంసిస్తున్నారు.