TSRTC Bus fare hike: తెలంగాణలో పెరగనున్న ఆర్టీసీ బస్సు చార్జీలు.. కిలో మీటర్‌కు ఎంత పెంచనున్నారంటే..!

First Published Dec 1, 2021, 2:04 PM IST

తెలంగాణలో ఆర్టీసీ బస్సు చార్జీలను (TSRTC Bus fare) పెంచనున్నారు. ఇందుకోసం తెలంగాణ ఆర్ఠీసీ (TSRTC) అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) వద్దకు ప్రతిపాదనలు పంపారు. కేసీఆర్ ఆదేశాలు రాగానే పెంచిన ఆర్టీసీ చార్జీలు అమల్లోకి రానున్నాయి.

తెలంగాణలో ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచనున్నారు. ఇందుకోసం తెలంగాణ ఆర్ఠీసీ అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు ప్రతిపాదనలు పంపారు. కేసీఆర్ ఆదేశాలు రాగానే పెంచిన ఆర్టీసీ చార్జీలు అమల్లోకి రానున్నాయి. అయితే డీజిల్ ధరలు పెరగడంతోనే ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచాలనే నిర్ణయం తీసుకున్నట్టుగా ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు. 

రెండు సంవత్సరాలు క్రితం ఆర్టీసీ చార్జీలు పెరిగినట్టుగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీ రూ. 1440 కోట్ల నష్టాల్లో ఉందన్నారు. డీజిల్ ధరలు పెరిగప్పుడే ఆర్టీసీ చార్జీలు పెంచడం జరిగిందన్నారు. ఆర్టీసీ చార్జీలు పెంపు ప్రతిపాదన ఫైల్ సీఎం వద్దకు చేరిందన్నారు. 

ఈ క్రమంలోనే ఆర్టీసీ చార్జీల పెంపుపై సీఎం కేసీఆర్ త్వరలోనే అధికారిక నిర్ణయం తీసుకున్నారు. చార్జీల పెంపుపై బుధవారం సీఎం కేసీఆర్‌తో మాట్లాడనున్నట్టుగా ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ (Bajireddy Govardhan) మీడియాకు తెలిపారు. 

డీజిల్ ఖర్చులు పెరగడం, కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో బస్సు సర్వీసులను పూర్తిగా నిలిపివేసిన కారణంగా ఆర్టీసీ భారీ నష్టాలు ఎదుర్కొంటుంది. ఈ క్రమంలోనే ఆర్టీసీ ఉన్నతాధికారులు చార్జీల పెంపుకు కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అతి త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది. 

పల్లె వెలుగు, సిటీ ఆర్డినరి బస్సుల్లో కిలోమీటర్‌కు  25 పైసల పెంపు, అన్నీ ఇతర బస్సుల్లో కిలో మీటర్‌కు 30 పైసల చొప్పున చార్జీలు పెంచాలని సజ్జనార్‌ ప్రతిపాదించారు.

click me!