ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత అన్నారు. దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నదని వివరించారు. కరోనా సమయంలో అఖండ హనుమాన్ చాలీసా పారాయణం ఘనంగా నిర్వహించామని తెలిపారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం యాగం నిర్వహించామని గుర్తు చేశారు. ఏ కొండ ఎక్కినా, ఏ బండ మొక్కినా రాష్ట్రం కోసమే అని అన్నారు.