TSPSC: తెలంగాణలో ఉద్యోగాల జాతర.. నిన్న గ్రూప్‌ 1, నేడు గ్రూప్‌ 2, రేపు..?

తెలంగాణలో నిర్వహించిన గ్రూప్‌ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రాత పరీక్షల ఫలితాలను విడుదల చేస్తోంది టీఎస్‌పీఎస్‌సీ. వరుసగా గ్రూప్‌ 1, 2, 3 ఫలితాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే సోమవారం గ్రూప్‌ 1 పరీక్ష ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే.. 
 

TSPSC Results 2025 Group 1 Declared, Group 2 Today, Group 3 Soon Full Schedule Inside in telugu

గ్రూప్‌ 1,2,3 ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షల ఫలితాలను యుద్ధప్రాతిపదిక విడుదల చేస్తోంది తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల నియామక మండలి (TSPSC). ఇందులో భాగంగానే సోమవారం గ్రూప్‌ 1 ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్ష ద్వారా మొత్తం 563 ఖాళీలను భర్తీ చేశారు. గతంలో నిర్వహించిన ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలను అధిగమించిన అభ్యర్థుల తుది ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. 
 

tspsc

నేడు గ్రూప్‌ 2 ఫలితాలు: 

ఇదిలా ఉంటే మంగళవారం గ్రూప్‌ 2 పరీక్ష ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుద‌ల చేయ‌నున్నారు. టీఎస్‌పీఎస్సీ 783 గ్రూప్‌-2 పోస్టుల‌కు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేష‌న్ ఇచ్చిన విష‌యం తెల్సిందే. అలాగే 1,363 గ్రూప్-3 పోస్టుల‌కు భర్తీకి గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో 1,401 పరీక్ష కేంద్రాల్లో రాత పరీక్షలు నిర్వహించారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. 
 


ఇతర పరీక్షల ఫలితాలు కూడా.. 

ఇదిలా ఉంటే వివిధ పోటీ పరీక్షల ఫలితాలను కూడా వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు టీఎస్‌పీఎస్సీ సన్నాహాలు చేస్తోంది. మార్చి 20వ తేదీ లోపు అన్ని పోటీ పరీక్షల ఫ‌లితాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. మార్చి 14వ తేదీన‌ గ్రూప్-3, మార్చి 17వ తేదీన‌ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, మార్చి 19వ తేదీన‌ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేస్తామ‌ని టీఎస్‌పీఎస్సీ తెలిపింది.
 

తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు: 

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగ నియామక ప్రక్రియకు సంబంధించి సోషల్‌ మీడియాలో జరుగుతోన్న తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని టీఎస్‌పీఎస్సీ చెబుతోంది. పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలమని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా రిజల్ట్స్‌ ప్రకటిస్తున్నామని చైర్మన్‌ బుర్రా వెంకటేశం స్పష్టం చేశారు. సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా చెప్తే.. అలాంటివారి మాటలు నమ్మవద్దని సూచించారు. 
 

Latest Videos

vuukle one pixel image
click me!