గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు: టీఆర్ఎస్ వ్యూహాం ఇదీ....

First Published Sep 14, 2020, 9:40 PM IST

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను టీఆర్ఎస్ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొంది.ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని గులాబీ ఇప్పటి నుండే వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. 

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్ఎస్ ఇప్పటి నుండే కసరత్తు చేస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి మాసంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.
undefined
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలని టీఆర్ఎస్ ఇప్పటి నుండే వ్యూహా రచన చేస్తోంది.నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి పల్లా రాజేశ్వర్ రెడ్డిని బరిలోకి దింపే అవకాశం ఉంది.
undefined
హైద్రాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి హైద్రాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ ను బరిలోకి దింపాలని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఈ ఇద్దరు అభ్యర్ధుల పేర్లను త్వరలోనే టీఆర్ఎస్ అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది.
undefined
ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్ఎస్ నాయకత్వం పార్టీ నేతలను సన్నద్దం చేస్తోంది. ఇవాళ నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చించారు.
undefined
ప్రతి ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక ఎమ్మెల్సీని ఇంఛార్జీగా నియమించనున్నారు.. మిగిలిన నియోజకవర్గాలకు మంత్రులు ఇంఛార్జీలుగా నియమిస్తారు. గతంలో జరిగినట్టుగా విపక్షాలకు అవకాశం ఇవ్వకూడదని కేటీఆర్ పార్టీ నేతలకు సూచించారు.
undefined
గతంలో మహబూబ్ నగర్, హైద్రాబాద్, రంగారెడ్డి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో టీఎన్జీఓ మాజీ నేత దేవీ ప్రసాద్ ను బరిలోకి దింపితే బీజేపీ విజయం సాధించింది. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడ టీఆర్ఎస్ కు ఓటర్లు షాకిచ్చారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఈ ఎన్నికల్లో విజయం సాధించారు.ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి చంద్రశేఖర్ గౌడ్ పై జీవన్ రెడ్డి విజయం సాధించారు.
undefined
ఈ రెండు స్థానాల్లో విజయం సాధించాలని టీఆర్ఎస్ ఇప్పటి నుండే వ్యూహారచన చేస్తోంది. హైద్రాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఆ జిల్లాల ప్రజా ప్రతినిధులతో కేటీఆర్ సమావేశం కానున్నారు.
undefined
click me!