గాంధీ నగర్ నుండే టీఆర్ఎస్ జైత్రయాత్ర: ఎమ్మెల్సీ కవిత

First Published Nov 19, 2020, 1:21 PM IST

గురువారం ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలో గాంధీ నగర్ లో గల లక్ష్మీ గణపతి ఆలయాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

హైదరాబాద్: హైదరాబాద్ లో గ్రేటర్ ఎన్నికల నగారా మోగి నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమయ్యింది. అయితే ప్రతి ఎన్నికల్లో ప్రత్యర్థులు ఇంకా అభ్యర్థులను వెతుక్కుంటూ వుండగానే అందరికంటే ముందే తమ అభ్యర్థులను ప్రకటించే వ్యూహాన్ని గ్రేటర్ ఎన్నికల్లో కూడా అధికార టీఆర్ఎస్ అనుసరిస్తోంది. అంతేకాకుండా ప్రతిపక్షాలు అభ్యర్థుల ఎంపికలో తలమునకలై వుండగానే టీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని కూడా ప్రారంభించింది.
undefined
గురువారం ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలో గాంధీ నగర్ లో గల లక్ష్మీ గణపతి ఆలయాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, గాంధీ నగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ముఠా పద్మనరేష్, టీఆర్ఎస్ నేతలు ముఠా జైసింహ, ఎమ్మెల్సీ కవిత గారితో పాటు ఆలయాన్ని దర్శించుకున్నారు.అనంతరం నామినేషన్ వేసేందుకు గాను అభ్యర్థితో కలిసి కవిత అబిడ్స్ సర్కిల్ కార్యాలయానికి వెళ్లారు.
undefined
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ... సీఎంకేసీఆర్ నాయకత్వంలో, కేటీఆర్ మార్గనిర్దేశనంలో గాంధీ నగర్ లో అభివృద్ధి చేశామన్నారు. మొత్తంగా రూ.67 వేల కోట్లతో హైదరాబాద్ ను అభివృద్ధి చేశామని...కరోనా వచ్చినా, వరద వచ్చినా ప్రజలకు టిఆర్ఎస్ అందుబాటులో ఉండి అందర్ని ఆదుకుందన్నారు.
undefined
పేదలకు, వరద బాధితులకు ప్రభుత్వం సహాయం చేస్తుంటే ప్రతిపక్షాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారన్నారు.కాంగ్రెస్, బీజేపీ పేద ప్రజల నోటి కాడి ముద్దను లాక్కున్నారని మండిపడ్డారు.జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు, కాంగ్రెస్, బీజేపికి లేదన్నారు.జాతీయ పార్టీలు అని చెప్పుకునే పార్టీలు నగర ప్రజలను పట్టించుకోలేదని పేర్కొన్నారు. టిఆర్ఎస్ జైత్రయాత్ర గాంధీ నగర్ డివిజన్ నుంచే ప్రారంభమవుతుందన్నారు ఎమ్మెల్సీ కవిత.
undefined
click me!