టీఆర్ఎస్ తరపున పోటీ చేయడానికి కారణమదే: సురభి వాణిదేవి

First Published Feb 22, 2021, 1:47 PM IST

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ పీఎం పివి నరసింహరావు కూతురు సురభి వాణీదేవి పోటీ చేస్తున్నారు. ఆమె పేరును ఆదివారం స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. 

హైదరాబాద్: తెలంగాణలో ఖాళీఅయిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ పీఎం పివి నరసింహరావు కూతురు సురభి వాణీదేవి పోటీ చేస్తున్నారు. ఆమె పేరును ఆదివారం స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించగా... ఇవాళ ఎన్నికలు జరిగే జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేలకు ఆమెను పరిచయం చేశారు. ఆమెకు భీపామ్ ఇవ్వగా ఇవాళ నామినేషన్ కూడా వేసి ప్రచారంలోకి దిగారు.
undefined
సురభి వాణి దేవి నామినేషన్ కు ముందు తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ఆమెతో మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, సబితారెడ్డి, రంగారెడ్డి జిల్లా స్ధానిక సంస్థల ఎంఎల్సి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఎంఎల్సీలు నారాయణరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఎంఎల్ఏ లు ప్రకాష్ గౌడ్, మహేష్ రెడ్డి తదితరులు వున్నాయి.
undefined
ఈ సందర్భంగా వాణిదేవి మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ తనపై వుంచిన నమ్మకాన్ని వమ్ముచేయనన్నారు. శక్తివంచన లేకుండా గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చిందే టీఆర్ఎస్ పార్టీయే కాబట్టి ఈ పార్టీ తరపున పోటీ చేస్తున్నానని అన్నారు. తెలంగాణ రాకముందు తాము కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని... అందువల్లే స్వరాష్ట్రాన్ని కాంక్షించామన్నారు. కేవలం సామాన్య ప్రజలగురించే కాదు విద్యావంతుల సమస్యలపైనా తనకు మంచి అవగాహన వుందని...వారికి అండగా నిలిచేందుకే ఎమ్మెల్సీ గా పోటీ చేస్తున్నట్లు వాణీదేవి తెలిపారు.
undefined
click me!