ఈటల రాజేందర్ బీజేపీలో చేరికకు ముహుర్తం ఖరారు చేసుకొన్నారు. రేపు హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేయనున్నారు.
undefined
ఈ రాజీనామా ఆమోదం పొందితే ఆరు మాసాల్లోపుగా ఎన్నికలు నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.
undefined
హుజూరాబాద్ నియోజకవర్గంలో తన అనుచరులతో ఈటల రాజేందర్ వరుసగా సమావేశాలు నిర్వహించారు. రెండు రోజుల సమావేశాలు ముగించుకొని ఆయన హైద్రాబాద్ కు చేరుకొన్నారు.
undefined
హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలకు టీఆర్ఎస్ ఇప్పటి నుండే ప్లాన్ చేసుకొంటుంది. రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో జిల్లాకు చెందిన మంత్రులు, పార్టీ నేతలు గురువారం నాడు హైద్రాబాద్ లో సమావేశమయ్యారు.
undefined
ఈ సమావేశంలో హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలతో పాటు ఈటల వెంట పార్టీ క్యాడర్, నేతలు వెళ్లకుండా ఏ రకమైన వ్యూహాలను అనుసరించాలనే దానిపై చర్చించారు.
undefined
ఈ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న అభివృద్ది కార్యక్రమాలను ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి ముందే ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు.
undefined
క్షేత్రస్థాయి టీఆర్ఎస్ క్యాడర్ తో మంత్రులు సమావేశాలు నిర్వహించేలా ప్లాన్ చేసుకొంటున్నారు. ఈటల రాజేందర్ పై సానుభూతి ఉందా.. ఆ సానుభూతి ఉంటే ఎన్నికల్లో ఏ మేరకు ఆయనకు లాభించనుందనే విషయాన్ని కూడ పార్టీ నేతలు చర్చించారు.
undefined
ఈటల రాజేందర్ పై సానుభూతి పనిచేయకుండా ఏ రకమైన వ్యూహాన్ని అమలు చేయాలనే దానిపై కూడ ఈ సమావేశంలో చర్చించారు.
undefined
కరీంనగర్ లో ఈ నెల 5వ తేదీన గంగుల కమలాకర్ నివాసంలో తీసుకొన్న నిర్ణయాలను అమలు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. నియోజకవర్గంలో సంక్షేమ పథకాలను కూడ ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలని సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు.
undefined
హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికలపై ఇప్పటినుండే టీఆర్ఎస్ నాయకత్వం కేంద్రీకరించింది. మండలాలు,గ్రామాలకు పార్టీ నేతలను ఇంచార్జీలుగా నియమించారు. ఇప్ప.టి నుండే పోలింగ్ బూత్ స్థాయి నుండి టీఆర్ఎస్ నాయకత్వం తమ వ్యూహాన్ని అమలు చేస్తోంది.
undefined
మంత్రులు హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించాలని నిర్ణయం తీసుకొన్నారు. త్వరలోనే మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు.
undefined
నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ ఈటల రాజేందర్ వెంట వెళ్లకుండా కూడ జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక నాయకత్వానికి మంత్రులు సూచించారు. ఈ మేరకు అవసరమైన కార్యాచరణను రూపొందించారు. ఈ నెల 14న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల రాజేందర్ బీజేపీలో చేరనున్నారు.
undefined