టీపీసీసీకి కొత్త బాస్: రేవంత్ వైపు ఠాగూర్ మొగ్గు?

First Published Jun 10, 2021, 11:12 AM IST

టీపీసీసీ చీఫ్ పదవి ఎంపిక కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కత్తిమీద సాముగా మారింది. పార్టీ నేతల మధ్య ఏకాభిప్రాయం కోసం అధిష్టానం ప్రయత్నాలు చేస్తోంది.

తెలంగాణ పీసీసీ చీఫ్ పదవికి కొత్త నేతను ఎంపిక చేసే విషయంలో పార్టీ నాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. పీసీసీ చీఫ్ గా కొత్త నేత ఎంపిక కోసం పార్టీ రాష్ట్ర ఇంచార్జీ మాణికం ఠాగూర్ ప్రయత్నాలు ప్రారంభించారు.
undefined
తెలంగాణ రాష్ట్రంలో పీసీసీకి కొత్త చీఫ్ ను ఎంపిక చేసే విషయంతో పాటు రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, రాజకీయ పరిస్థితులపై మాణికం ఠాగూర్ సోనియాగాంధీకి నివేదికను అందించారు.
undefined
పీసీసీ చీఫ్ రేసులో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరులున్నారు. అయితే జగ్గారెడ్డి రేసులో వెనుకబడ్డారు. పార్టీ జాతీయ నాయకత్వానికి అందించిన జాబితాలో జగ్గారెడ్డి పేరు లేదని సమాచారం. దీంతో జగ్గారెడ్డి కొంత అసంతృప్తిని వ్యక్తం చేశారు.
undefined
పీసీసీ చీఫ్ పదవికి రేవంత్ రెడ్డి అయితే సమర్ధుడనే భావనతో మాణికం ఠాగూర్ ఉన్నారనే ప్రచారం సాగుతోంది. అయితే రేవంత్ రెడ్డికి పీసీసీ చీప్ పదవిని ఇవ్వడాన్ని అంతేస్థాయిలో కొందరు సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు. అయితే నేతల మధ్య ఏకాభిప్రాయం తీసుకొచ్చేందుకు పార్టీ జాతీయ నాయకత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.
undefined
ఇటీవల రాజ్‌భవన్ లో గవర్నర్ కు వినతి పత్రం సమర్పించేందుకు కాంగ్రెస్ నేతలు వచ్చిన సమయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా మంతనాలు జరిపారు
undefined
రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవిని కట్టబెడితే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఎఐసీసీ పదవిని కట్టబెట్టే అవకాశం ఉందనే ప్రచారం కూడ లేకపోలేదు. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
undefined
కేరళ పీసీసీ చీఫ్ గా సుధాకరన్ ను నియమించింది పార్టీ నాయకత్వం. తెలంగాణలో కూడ పీసీసీ చీఫ్ గా నియామకం త్వరలో జరిగే అవకాశం ఉంది.
undefined
నాగార్జునసాగర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జీవన్ రెడ్డి పేరును పీసీసీ చీఫ్ గా అధికారికంగా ప్రకటించడమే అనుకొన్నారు. కానీ నాగార్జునసాగర్ ఎన్నికల తర్వాత పీసీసీ చీఫ్ పదవి ఎంపిక ప్రక్రియను చేపట్టాలని జానారెడ్డి కోరారు.దీంతో పీసీసీ చీఫ్ ఎంపిక వాయిదా పడింది.
undefined
నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైంది. ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి కూడ త్వరలోనే ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ స్థానంలో చావో రేవో తేల్చుకోవాల్సిన అనివార్య పరిస్థితులు కాంగ్రెస్ కు నెలకొన్నాయి.
undefined
వరుస ఓటములతో ఉన్న కాంగ్రెస్ కు హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలు అగ్నీ పరీక్షగా మారనున్నాయి.ఉప ఎన్నికతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సన్నద్దం చేసే నాయకుడి కోసం కాంగ్రెస్ నాయకత్వం అన్వేషిస్తోంది.
undefined
పీసీసీ చీఫ్ పదవి విషయంలో నేతల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే కొత్త నేత ఎంపిక చేసినట్టుగా పార్టీ నాయకత్వం ప్రకటించే అవకాశం ఉంది. ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి అధిష్టానం ప్రయత్నాలు ప్రారంభించింది.
undefined
click me!