ప్రపంచంలో అత్యంత ధనవంతులు ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్... భారత్ లో అత్యంత ధనవంతులు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ... మరి తెెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనవంతులు ఎవరు?
Richest people in Hyderabad : భారతదేశంలో అత్యంత ధనవంతులు ఎవరంటే అంబానీ, అదానీ పేర్లు వినిపిస్తాయి. మరి తెలుగు రాష్ట్రాల్లో రిచ్చెస్ట్ ఎవరు? ఏంటి ఏ పేరు తట్టడంలేదా?. మన తెలుగోళ్ళలో కూడా అంబానీలు, అదానీలంత కాకున్నా బాగానే సంపాదించేవారు వున్నారు. వాళ్లు ఎవరో తెలుగోళ్లమైన మనకే తెలియకపోవడం దురదృష్టకరం. కాబట్టి మన తెలుగోళ్లలో అత్యంత ధనవంతులు ఎవరో తెలుసుకుందాం.
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ రిచ్చెస్ట్ పర్సన్స్ హైదరాబాద్ లోనే వున్నారు. వారి వ్యాపారాలు కూడా హైదరాబాద్ కేంద్రంగానే కొనసాగుతున్నాయి. ఇలా మొత్తం
110 మంది వ్యాపారులు రూ.1000 కోట్ల కంటే ఎక్కువ సంపద కలిగివున్నారు. వీరిలో అత్యధికులు (22 శాతం) ఫార్మా రంగంలో వున్నారు. ఆ తర్వాత (20 శాతం) ఎక్కువగా కన్స్ట్రక్షన్స్, రియల్ ఎస్టేట్ రంగంలో వున్నారు.