మూడు కొత్త రుచులతో ఆరోగ్య ఆయుష్ ఇమ్యూనిటీ బూస్టర్ షాట్స్..

First Published May 26, 2021, 12:46 PM IST

కరోనా నేపథ్యంలో వ్యాధినిరోధకతను పెంచుకోవడం అత్యవసరమైన నేపథ్యంలో.. నగరానికి చెందిన ల్యాబ్‌క్యూబ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ‘మన ఆరోగ్య ఆయుష్ ఇమ్యూనిటీ బూస్టర్ షాట్స్’లో మరో మూడు కొత్త రుచులను (మింట్, పైనాపిల్, మిక్స్‌డ్ ఫ్రూట్) బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది.

కరోనా నేపథ్యంలో వ్యాధినిరోధకతను పెంచుకోవడం అత్యవసరమైన నేపథ్యంలో.. నగరానికి చెందిన ల్యాబ్‌క్యూబ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ‘మన ఆరోగ్య ఆయుష్ ఇమ్యూనిటీ బూస్టర్ షాట్స్’లో మరో మూడు కొత్త రుచులను (మింట్, పైనాపిల్, మిక్స్‌డ్ ఫ్రూట్) బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది.కరోనాతోపాటు ఇతర వైరస్‌ల బారినుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు.. భారతీయ సంప్రదాయ వైద్యమైన ఆయుర్వేదానికి వివిధ రుచులను జోడించి వ్యాధినిరోధకత పెంచుకునేలా ప్రోత్సహించేందుకే మరిన్ని రుచులను మార్కెట్లోకి తీసుకొచ్చినట్లు సంస్థ ప్రకటించింది.
undefined
ల్యాబ్‌క్యూబ్, ఐఎన్సీ-యూఎస్ఏ భాగస్వామ్య సంస్థ అయిన ల్యాబ్‌క్యూబ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ.. ‘మన ఆరోగ్య ఆయుష్ ఇమ్యూనిటీ బూస్టర్ షాట్స్’ను గతేడాది డిసెంబర్‌లో కేంద్ర మంత్రి. జి. కిషన్ రెడ్డి విడుదల చేసిన సంగతి తెలిసిందే.వినియోగదారుల ఇంటివద్దకే వీలైనంత త్వరగా ‘మన ఆరోగ్య ఆయుష్ ఇమ్యూనిటీ బూస్టర్ షాట్స్’ చేరేలా వివిధ ప్రముఖ లాజిస్టిక్స్ సంస్థలతో ల్యాబ్‌క్యూబ్ సంస్థ కలిసి పనిచేస్తోంది. ఈ ఇమ్యూనిటీ బూస్టర్ షాట్స్‌ ఒక బాటిల్ ధర 73 రూపాయలకు అందుబాటులో ఉండగా.. రేషన్ కార్డు ఉన్నవారికి రూ. 55కే దొరుకుతోంది.
undefined
త్వరలోనే ఈ ఉత్పత్తులను మెడికల్ దుకాణాలు, కిరాణా దుకాణాలు, అమెజాన్ వంటి ప్రధాన ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్ల ద్వారా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ల్యాబ్‌క్యూబ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్, సీఈవో శ్రీనివాస్ మనప్రగడ వెల్లడించారు.కొత్త రుచులను మార్కెట్లోకి విడుదల చేయడంపై ఆయన మాట్లాడుతూ ‘కరోనా నేపథ్యంలో ప్రజల వ్యాధినిరోధక శక్తి పెరగాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని వినూత్నమైన ఆయుర్వేద ఫార్ములాతో వివిధ ఉత్పత్తులకు రూపకల్పన చేశాము. తీవ్రమైన వైరస్‌లను కూడా తట్టుకునేలా వివిధ మూలికలతో ఈ ఉత్పత్తులను రూపొందించాం.ల్యాబ్‌క్యూబ్ ఉత్పత్తులకు కేంద్ర ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ అనుమతి కూడా లభించింది. ప్రస్తుతానికి నేరుగా వినియోగదారులకు ఇంటివద్దకే మా ఉత్పత్తులను చేరవేస్తున్నాం. రెండోదశ కరోనా నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగొద్దనే ఈ నిర్ణయం తీసుకున్నాం. త్వరలోనే వివిధ వేదికల ద్వారా మరింతగా ల్యాబ్‌క్యూబ్ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొస్తాం’ అని తెలిపారు.
undefined
కరోనా నియంత్రణలో విజయవంతంగా పనిచేస్తున్న నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన శ్రీ ఆనందయ్య ఉపయోగిస్తున్న ఫార్ములా, తమ ఫార్ములా ఒకటేనని శ్రీనివాస్ మనప్రగడ వెల్లడించారు. కానీ ల్యాబ్‌క్యూబ్ ఇమ్యూనిటీ బూస్టర్ షాట్స్.. ఔషధేతర ఆయుర్వేద సప్లిమెంట్లుగానే అనుమతులు పొందిందని.. ఇవి ప్రజలకు ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడుతుందని.. ఆయన తెలిపారు.ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే ఇలాంటి కంపెనీలను నెలకొల్పేందుకు ముందుకొస్తున్న ఎన్నారైలను ప్రోత్సహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను శ్రీనివాస్ కోరారు. ‘కేంద్ర ప్రభుత్వం ఆలోచనలైన మేకిన్ ఇండియా, ఆయుష్, సాధికారత, మహిళలు, యువకులకు ఉపాధి కల్పన తదతర అంశాల స్ఫూర్తితో ల్యాబ్‌క్యూబ్ సంస్థ పనిచేస్తోంది.
undefined
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్‌ షా, జి. కిషన్ రెడ్డిల నాయకత్వ స్ఫూర్తితో మా కంపెనీ ఎప్పుడూ సమాజానికి వీలైనంత సేవ చేసేందుకే శ్రమిస్తోంది’ అని శ్రీనివాస్ మనప్రగడ తెలిపారు.కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఈ ఉత్పత్తులను వినియోగించవచ్చని, దీంతోపాటు మార్కెట్‌లోని ఇతర వస్తువులతో పోలిస్తే తక్కువ ధరకే ప్రజలకు తమ ఉత్పత్తులను అందుబాటులో ఉంచడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. వందశాతం సహజసిద్ధమైన పధార్థాలతో రూపొందించిన ఇమ్యూనిటీ బూస్టర్ల ద్వారా సాధారణ ఇన్‌ఫెక్షన్లను ఎదుర్కునే శక్తితోపాటు శ్వాసనాళ ఇన్‌ఫెక్షన్లను ఎదుర్కునే సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు.
undefined
ఈ ఇమ్యూనిటీ బూస్టర్ షాట్స్ వల్ల ప్రధానమైన ఉపయోగాలు: 1. వ్యాధినిరోధక శక్తిపెరుగుతుంది2. యాంటాక్సిడెంట్‌గా పనిచేస్తుంది3. వైరల్ ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది4. శ్వాసనాల సంబంధిత సమస్యలు రాకుండా తోడ్పడుతుంది5. రోజువారి వినియోగం ద్వారా ఆరోగ్యకరమైన శారీరక బరువు నిర్వహణ సాధ్యమవుతుంది.6. వందశాతం సహజసిద్ధ పధార్థాలతో తయారీ7. ఒక్కో షాట్‌లో 60 ఎంఎల్ ఔషధం ఉంటుంది. వైద్యుల సూచన మేరకు 30 ఎంఎల్ చొప్పున రెండుసార్లు వేసుకోవచ్చు.8. 18 షాట్స్, 36 షాట్స్ ప్యాక్‌లు అందుబాటులోఉన్నాయి.వినియోగదారుల కోరిక మేరకు మరింత ఎక్కువ షాట్స్‌తో ప్యాక్‌ చేసి ఇవ్వగలము.ఈ ఇమ్యూనిటీ బూస్టర్ షాట్స్‌కు యూఎస్ ఎఫ్‌డీఏ, ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) భారత ప్రభుత్వ ఆయుష్ విభాగం అనుమతులు ఉండటంతోపాటు ఐఎస్‌వో 22000 సర్టిఫికేషన్ కూడా ఉంది.
undefined
ల్యాబ్‌క్యూబ్ గురించిhttps:labcube.inకరోనా నేపథ్యంలో ప్రజలకు మేలు చేయాలనే సామాజిక దృక్పథంతో ల్యాబ్‌క్యూబ్ స్టార్టప్ కంపెనీని ఆవిష్కరించారు. ఈ సంస్థ ద్వారా ఆయుర్వేద ఇమ్యూనిటీ బూస్టర్ షాట్స్‌ తోపాటు విస్తృతశ్రేణిలో ఇతర కరోనా రక్షణ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. భారత్‌తోపాటు అమెరికాలోనూ సేవలందిస్తున్న ఈ సంస్థ.. ఒకేచోట వినియోగదారులకు అన్ని వస్తువులు లభించాలన్న లక్ష్యంతో పనిచేస్తోంది.లక్ష్యంఒకేచోట వినియోగదారులకు అవసరమైన వివిధ ఉత్పత్తులు లభించే వ్యవస్థను అభివృద్ధి చేయడంతోపాటు ప్రజల జీవితాలను మరింత ఆరోగ్యకరంగా, సౌకర్యవంతంగా మార్చేందుకు పనిచేయడం.ఉద్దేశంవిస్తృతమైన వ్యాధినిరోధకను పెంచే ఉత్పత్తులను, భద్రతా పరికరాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రజల జీవితాలను ఆరోగ్యకరంగా మార్చడంతోపాటు, పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడటం.మరిన్ని వివరాలకు సంప్రదించండి: రాజేశ్వర్ రెడ్డి- 7702220228
undefined
click me!