భయం వద్దు... నేనున్నా, గాంధీలో కరోనా రోగులకు కేసీఆర్ భరోసా (ఫోటోలు)

First Published May 19, 2021, 9:04 PM IST

భయం వద్దు... నేనున్నా, గాంధీలో కరోనా రోగులకు కేసీఆర్ భరోసా (ఫోటోలు)

క్లిష్ట పరిస్ధితుల్లో సేవలు అందిస్తున్న జూనియర్ డాక్టర్లకు కేసీఆర్ అభినందనలు
undefined
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం నాడు గాంధీ ఆసుపత్రిలో పర్యటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులను ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకొన్నారు
undefined
ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుండి తప్పించిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖను కేసీఆర్ తన వద్దే ఉంచుకొన్నారు
undefined
గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుతం 1500 మంది కరోనా రోగులున్నారు
undefined
కరోనా రోగులకు అందుతున్న భోజనం గురించి కూడ ఆయన వాకబు చేశారు. మందుల కొరత లేకుండా చూసుకోవాలని సీఎం వైద్య శాఖాధికారులకు సూచించారు
undefined
ఐసీయూలో చికిత్స తీసుకొంటున్న రోగులకు సీఎం ధైర్యం చెప్పారు.గత టర్మ్‌లో ఉస్మానియా ఆసుపత్రిలో ఆయన పర్యటించారు. ఉస్మానియా ఆసుపత్రిని కూల్చి కొత్త భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
undefined
నిమిషానికి రెండు వేల లీటర్ల ఆక్సీజన్ ను తయారు చేసే ఆక్సీజన్ ప్లాంట్ ను ఇటీవలే గాంధీలో సిఎం ఆదేశాలమేరకు నెలకొల్పా
undefined
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానాల్లో ఆక్సీజన్ ప్లాంట్లను నెలకొల్పాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో...గాంధీలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ను ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ పరిశీలించారు
undefined
జూనియర్ డాక్టర్లు, నర్సుల సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల కోసం ప్రతిపాదనలను తక్షణమే పంపాలని వైద్య అధికారులను సిఎం ఆదేశించారు
undefined
ఔట్ పేషెంట్ విభాగాన్ని పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్
undefined
జనరల్ వార్డుల్లో కరోనా రోగుల యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటున్న కేసీఆర్
undefined
కరోనా రోగుల ఆరోగ్యంపై వాకబు చేస్తున్న సీఎం కేసీఆర్
undefined
నర్సులు, వైద్య సిబ్బంది సమస్యలు వింటున్న ముఖ్యమంత్రి కేసీఆర్
undefined
వృద్ధుడి నుంచి వివరాలు తెలుసుకుంటున్న సీఎం కేసీఆర్
undefined
గాంధీ ఆసుపత్రిలోకి ముఖ్యమంత్రిని తీసుకొస్తున్న అధికారులు
undefined
click me!