లాక్ డౌన్ : మారువేషంలో ఏసీపీ.. ఆ పోలీసులు చేసిన పని చూసి షాక్....

First Published May 25, 2021, 1:44 PM IST

లాక్ డౌన్ నిబంధనలు తన సిబ్బంది ఎలా అమలు చేస్తున్నారో.. తెలుసుకోవాలనుకున్నాడో ఏసీపీ.. దీనికోసం స్వయంగా మారువేషంలో రంగంలోకి దిగాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. 

లాక్ డౌన్ నిబంధనలు తన సిబ్బంది ఎలా అమలు చేస్తున్నారో.. తెలుసుకోవాలనుకున్నాడో ఏసీపీ.. దీనికోసం స్వయంగా మారువేషంలో రంగంలోకి దిగాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.
undefined
‘రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నాం. అనవసరంగా ఎవరు బయటకు రావద్దు, బయటకు వస్తే చర్యలు తప్పవు’ ఇవి పోలీస్ బాస్ డీజీపీ మహేందర్ రెడ్డి మాటలు. అయితే క్షేత్రస్థాయిలో లాక్ డౌన్ అమలు ఎలా ఉందో తెలుసుకోడానికి ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్ పూనుకున్నారు.
undefined
తలకు రుమాలుతో, సాధారణ దుస్తుల్లో మారు వేషంతో, పాత బైకు మీద రోడ్డు పైకి వచ్చారు. ప్రతి చెక్ పోస్ట్ దగ్గర తనదైన శైలిలో సమాధానం చెబుతూ ముందుకు సాగిపోయారు.
undefined
తాను మెకానిక్ నని, మందులు తెచ్చుకోవడానికి వెళ్తున్నానని ఒక చోట.. జ్వరం ఉందని మరో చోట... మంత్రి పీఏ తో మాట్లాడండి అంటూ ఇంకో చోట... ఇలా ఆపిన ప్రతి చోట ఏదో ఒక కహనీ చెప్పేవారు. ఒక చోట మాత్రం తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు.
undefined
అయితే అక్కడున్న సీనియర్ అధికారి ఈయన్ను ముందుకు వెళ్లనిచ్చేది లేదని ఖరాఖండిగా చెప్పేశారు. అవసరమైతే తమ పోలీసులే మందులు తీసుకువస్తారని, బండి తీసుకుని పక్కన పెట్టేశారు.
undefined
ఇంతలో ఫోన్ చేసినట్టు నటిస్తూ పోలీస్ అధికారికి మస్కా కొట్టాలని చూశారు. అయితే ఆయన పట్టించుకోలేదు. దీంతో తమ సిబ్బంది పనితీరు మెచ్చుకున్న ఆ సీనియర్... అప్పుడు అసలు విషయం చెప్పుకొచ్చారు.
undefined
తలకు కట్టిన రుమాలు తీసేసరికి అక్కడున్న పోలీస్ సిబ్బంది ఆశ్చర్యపోయారు. సాధారణ పౌరుడిగా సీనియర్ ఆఫీసర్ సిద్దిపేట అదనపు ఎస్పీ రామేశ్వర్. లాక్‌డౌన్‌ ప్రజల పట్ల పోలీసుల తీరుతెన్నులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఇలా చేశాను అని చెప్పుకొచ్చారు.
undefined
click me!