రేవంత్ రెడ్డి కేబినెట్‌: ఖమ్మం నుండి డిప్యూటీ సీఎంతో పాటు మరో ఇద్దరికి చోటు

First Published | Dec 7, 2023, 4:42 PM IST

ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి ముగ్గురికి మంత్రి పదవులు దక్కాయి.  ఇదే జిల్లాకు చెందిన  మల్లు భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం పదవి దక్కింది. 

రేవంత్ రెడ్డి కేబినెట్‌: ఖమ్మం నుండి డిప్యూటీ సీఎంతో పాటు మరో ఇద్దరికి చోటు

ఉమ్మడి ఖమ్మం జిల్లా  నుండి  ముగ్గురికి  మంత్రి పదవులు దక్కాయి.  ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మల్లు భట్టి విక్రమార్కకు  డిప్యూటీ సీఎం పదవి దక్కింది. మరో వైపు ఇదే జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులకు  కూడ  మంత్రి పదవి దక్కింది.

రేవంత్ రెడ్డి కేబినెట్‌: ఖమ్మం నుండి డిప్యూటీ సీఎంతో పాటు మరో ఇద్దరికి చోటు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో  బీఆర్ఎస్ ఒకే ఒక్క స్థానం దక్కింది. 2014, 2018 ఎన్నికల్లో  కూడ  ఈ జిల్లా నుండి ఒకే ఒక్క స్థానం  బీఆర్ఎస్ కు దక్కింది.  ఈ దఫా  బీఆర్ఎస్ గణనీయమైన సీట్లు సాధించాలనే ఉద్దేశ్యంతో కేసీఆర్  జిల్లాలోని  10 నియోజకవర్గాలకు ఇంచార్జీలను నియమించారు. జిల్లాకు చెందిన  ఇద్దరు కీలక నేతలు  తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు  బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

Latest Videos

రేవంత్ రెడ్డి కేబినెట్‌: ఖమ్మం నుండి డిప్యూటీ సీఎంతో పాటు మరో ఇద్దరికి చోటు

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పార్టీ వీడడం  తమకు  మంచే జరిగిందని  కూడ  ఎన్నికల సభల్లో కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. అయితే  బీఆర్ఎస్ లో  తమకు జరిగిన అవమానాలకు  తుమ్మల నాగేశ్వరరావు,  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు  కూడ  ప్రతీకారం తీర్చుకోవాలని భావించారు.  ఈ ఎన్నికలను ఇందుకు అవకాశంగా తీసుకున్నారు.

రేవంత్ రెడ్డి కేబినెట్‌: ఖమ్మం నుండి డిప్యూటీ సీఎంతో పాటు మరో ఇద్దరికి చోటు

 ప్రస్తుతం  భద్రాచలం నుండి బీఆర్ఎస్ నుండి  ఎమ్మెల్యేగా విజయం సాధించిన వెంకట్రావు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంట కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ లో చేరిన కొన్ని రోజులకే  వెంకట్రావు తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్లారు. భద్రాచలం నుండి  బీఆర్ఎస్ అభ్యర్ధిగా వెంకట్రావు విజయం సాధించారు.  మిగిలిన 9 స్థానాల్లో ఎనిమిది స్థానాల్లో  కాంగ్రెస్ అభ్యర్థులు , ఒక్క స్థానంలో  సీపీఐ అభ్యర్థి విజయం సాధించారు.

రేవంత్ రెడ్డి కేబినెట్‌: ఖమ్మం నుండి డిప్యూటీ సీఎంతో పాటు మరో ఇద్దరికి చోటు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో  బీఆర్ఎస్  విజయంలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు నేతలతో పాటు  పార్టీలో సీనియర్ నేతగా ఉన్న  మల్లు భట్టి విక్రమార్కకు కూడ రేవంత్ రెడ్డి కేబినెట్ లో చోటు దక్కింది.  మల్లు భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం పదవి దక్కింది.  

రేవంత్ రెడ్డి కేబినెట్‌: ఖమ్మం నుండి డిప్యూటీ సీఎంతో పాటు మరో ఇద్దరికి చోటు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో  బీఆర్ఎస్  నుండి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్ధి కూడ  దక్కకుండా  చేస్తానని పొంగులేటి శపథం చేశారు. అయితే  ఒక్క ఎమ్మెల్యే స్థానం మినహా  ఈ దఫా  మిగిలిన అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే  ఈ జిల్లా నుండి గెలుపొందారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో  ముగ్గురికి  రేవంత్ రెడ్డి కేబినెట్ లో మంత్రి పదవి దక్కింది.

click me!