సీఎం రేవంత్ రెడ్డిది రెడ్డి కమ్యూనిటీ అయినా ఆయన మామూలు మధ్యతరగతి కుటుంబం నుంచే వచ్చాడు. పెద్దగా ఆస్థిపాస్తులేమీ లేవు. సొంతంగానే ఎదిగాడు. చిన్నప్పట్నుంచి ముక్కుసూటి మనిషి. తను ఏదైనా అనుకున్నాడంటే చేసి నిరూపిస్తాడు. సాధించే వరకు వదిలిపెట్టని మనస్థత్వం. అదే ఇప్పుడు ఆయన్ని తెలంగాణ రాష్ట్రానికి సీఎంని చేసింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన సీఎంగా నేడు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ నేపథ్యం రేవంత్ రెడ్డి లవ్ స్టోరీలో ఓ కొత్తకోణం, ఇప్పటి వరకు బయటకు రాని ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది.
రేవంత్ రెడ్డి.. మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తమ్ముడి కూతురు గీతారెడ్డిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిది లవ్, ఆ తర్వాత పెద్దల అంగీకారంతో చేసిన పెళ్లి. అయితే ఇంటర్మీడియట్ సమయంలోనే రేవంత్ రెడ్డి, గీతా రెడ్డి పరిచయం. ఆసమయంలోనే ఇద్దరు మనసులు కలిశాయట. నాగార్జున సాగర్‌లో ఇద్దరు కలిసి చదువుకున్నారు. ఆ సమయంలోనే స్నేహం, కాస్తా ప్రేమగా మారింది. రేవంత్ లవ్‌ని గీతా యాక్సెప్ట్ చేసింది.
తనని పోషించడం కోసం, తాను ఓ వృత్తిలో ఉన్నానని చెప్పడం కోసం రేవంత్ రెడ్డి కొన్నాళ్లు జర్నలిస్ట్ గా మారాడు. ఆయన `జాగృతి` వార పత్రికలో పేజ్ డిజైనర్‌గా పనిచేశాడు. కొన్నాళ్లు `పల్లకి` వారపత్రికలోనూ పనిచేశాడు. ఆ తర్వాత ఉన్నత విద్య చేశాడు. తమ ప్రేమ బలపడింది. రేవంత్‌రెడ్డిని గీతా రెడ్డి కూడా బలంగా కోరుకుంది. ఆయన్ని విడిచి ఉండలేకపోయింది. ఆ విషయం నాన్నకి తెలిసి ఆమెపై సీరియస్ అయ్యాడు. రేవంత్ రెడ్డికి వార్నింగ్‌లు కూడా ఇచ్చారట. అంతేకాదు ఇక్కడ ఉంటే సేఫ్ కాదని, ఢిల్లీలో ఉన్న అన్న కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ఇంటికి పంపించాడు.
రేవంత్ రెడ్డి డేర్ చేసి ఢిల్లీ వెళ్లాడు. అక్కడ వీఐపీ సెక్యూరిటీ ఉన్న జైపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి గీతా రెడ్డిని కలిశాడు. దీంతో జైపాల్‌రెడ్డి ఫ్యామిలీ బయపడింది. గీతా రెడ్డి కూడా అతన్ని బలంగా కోరుకుంటుంది. తాము ఎంత చేసినా రేవంత్ వస్తున్నాడు, రేపు ఏదో సమయంలో ఈ ఇద్దరు లేచిపోయినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే కేంద్రమంత్రిగా తమ పరువు పోతుందని జైపాల్ రెడ్డి భావించాడు. దీనితోడు రేవంత్ రెడ్డి రాయబారం నడిపించాడు. దీంతో ఎట్టకేలకు దిగొచ్చారు. అయితే తమ రెడ్డి కమ్యూనిటీనే కావడంతో బలవంతంగానైనా ఒప్పుకున్నారు.
అయితే గీతా రెడ్డిని పెళ్లి చేసుకున్నాక ఎలా పోషిస్తారనే ప్రశ్న ఎదురైంది. రేవంత్ ఆర్థిక పరిస్థితిపై వాళ్లు కొంత అవమానంగా మాట్లాడారట. దీనికి ఆయన బాగా హర్ట్ అయ్యాడట. అందుకే తనకు మీడియాలో అనుభవం ఉండటంతో కొన్నాళ్లపాటు ప్రింటింగ్ ప్రెస్ పెట్టాడు. తాను ఏం చేస్తున్నాడో అందరికి చెప్పేందుకు హుందాగా ఉంటుందని కొన్నాళ్లపాటు ప్రింగింగ్‌ప్రెస్‌ని నడిపించాడు రేవంత్ రెడ్డి. అయితే ఆ సమయంలో తాము సహాయం చేస్తామని జైపాల్ రెడ్డి ఫ్యామిలీ డబ్బు ఆఫర్ చేశారట. కానీ తనకు మీ డబ్బు అవసరం లేదు, తన భార్య ఎలా పోషించుకోవాలో, ఎలా చూసుకోవాలో తనకు తెలుసు అని, ఎవరి సహాయం అవసరం లేదని, తనే కష్టపడి ఆ ప్రింటింగ్ ప్రెస్‌ని నడిపించారు. కొన్నాళ్ల తర్వాత దాన్ని మూసేశాడు.
అయితే తన ఆర్థిక స్థితి, తన ఇమేజ్ గురించి గీతా రెడ్డి ఫ్యామిలీ నుంచి కొంత అవమానం ఎదురయ్యిందని, దీంతో అప్పుడు తాను భవిష్యత్‌లో రాజకీయ నాయకుడిగా ఎదిగి చూపిస్తానని ఛాలెంజ్ కూడా విసిరారట. సీఎంగా ఎదగాలనేది ఆ దశలోనే రేవంత్ రెడ్డి కలిగిందని. దీంతో ఏబీవీపీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అనుభవంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. జెడ్‌పీటీసీ స్థాయి నుంచి రాజకీయాలు చేస్తూ వచ్చాడు. గ్రౌండ్ లెవర్ రాజకీయాలను చూస్తూ వచ్చాడు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్‌లోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా కోట్లకు ఎదిగారు. ఆ తర్వాత అసలైన రాజకీయాలు ప్రారంభించాడు.
రేవంత్ రెడ్డి రాజకీయంగా ఎదిగిన తర్వాత టీడీపీలో కీలక లీడర్ గా మారిన తర్వాత బీజేపీ నుంచి ఆఫర్ వచ్చిందట. కానీ దాన్ని తిరస్కరించారు. బీజేపీలోకి వెళితే తాను ఎదగలేనని,తొక్కేస్తారని భావించి ఆ సాహసం చేయలేదు. తనకు కాంగ్రెస్ మాత్రమే కరెక్ట్ అని ఆయన కాంగ్రెస్‌లోకి వెళ్లారు. అయితే అప్పటికే రేవంత్ రెడ్డి తాను సీఎం కావాలనే టార్గెట్ పెట్టుకున్నాడు. ఎమ్మెల్సీ చేసిన సమయంలోనే తరచూ రాజకీయ ప్రముఖులతో చెబుతుండే వాడట. నేను ఏ రోజైనా సీఎం అయి తీరుతా అని. ఇటీవల ప్రొ. నాగేశ్వర్ ఈ విషయాన్ని వెల్లడించాడు. తనతో ఎప్పుడూ `సర్ నేను ఎప్పటికైనా సీఎం అవుతా` అని చెప్పేవారని, దాన్ని నిజం చేసిచూపించాడని ఆయన కితాబిచ్చాడు. ఇక ఈ రోజు(డిసెంబర్ 7న) ఏకంగా రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం విశేషమనే చెప్పాలి. ఇదొక ఇన్‌స్పైరింగ్ జర్నీ అని చెప్పొచ్చు.