జైలుకెళ్లిన నేతలకు ముఖ్యమంత్రి పదవులు: నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నేడు రేవంత్...రేపు చంద్రబాబుకు దక్కేనా?

First Published | Dec 7, 2023, 11:29 AM IST

దేశంలో  పలువురు  జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత  సీఎంలయ్యారు. మరికొందరు  సీఎంలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత  జైలుకు వెళ్లారు. తెలుగు రాష్ట్రాల్లో  జైలుకు వెళ్లి వచ్చిన ఇద్దరు నేతలు  సీఎంలుగా బాధ్యతలు చేపట్టారు.

దేశంలో పలువురు నేతలు  జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత  ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. మరికొందరు నేతలు  ముఖ్యమంత్రులుగా  బాధ్యతలు చేపట్టిన తర్వాత  కూడ  జైలుకు వెళ్లారు.  తెలుగు రాష్ట్రాల్లో  వైఎస్ జగన్మోహన్ రెడ్డి  జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత  ముఖ్యమంత్రిగా  బాధ్యతలు చేపట్టారు.  

తెలంగాణ  ముఖ్యమంత్రిగా  ఇవాళ రేవంత్ రెడ్డి  బాధ్యతలు చేపట్టనున్నారు.రేవంత్ రెడ్డి గతంలోనే జైలుకు వెళ్లి వచ్చారు.  ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు  జైలు నుండి ఈ ఏడాది అక్టోబర్  31న విడుదలయ్యారు.  వచ్చే ఏడాది  ఏప్రిల్, మే మాసాల్లో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి.  దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో చంద్రబాబుకు  కలిసి వస్తుందా లేదా అనేది  ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి.


ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం చరణ్ సింగ్  ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లారు.  రెండు దఫాలు ఆయన  ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు.1967లో తొలిసారి  చరణ్ సింగ్  ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా  బాధ్యతలు చేపట్టారు.  1970లో  రెండో దఫా ఆయన  సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో  ఎమర్జెన్సీని  విధించిన  సమయంలో  చరణ్ సింగ్  ను అరెస్ట్ చేశారు.

j jayalalitha

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో  అరెస్టయ్యారు. 2014 సెప్టెంబర్  26న ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జయలలిత అరెస్టయ్యారు.  2015 మే 11న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు జయలలితను నిర్ధోషిగా ప్రకటించింది. 2015 మే 23 వ తేదీన  తమిళనాడు ముఖ్యమంత్రిగా  ప్రమాణం చేశారు.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కూడ గతంలో  అరెస్టయ్యారు.  తమిళనాడు ముఖ్యమంత్రిగా కరుణానిధి ఐదు దఫాలు  పనిచేశారు.  1969లో  తొలిసారిగా  కరుణానిధి  సీఎంగా ప్రమాణం చేశారు.2006 నుండి  2011 వరకు  కరుణానిధి  ఐదోసారి  సీఎంగా విధులు నిర్వహించారు. 2011లో జరిగిన  ఎన్నికల్లో  డీఎంకే ఓటమి పాలైంది.తమిళనాడులో  అన్నాడీఎంకె  ప్రభుత్వం ఏర్పాటైంది.  ఈ సమయంలో  కరుణానిధి అరెస్ట్ సమయంలో  వ్యవహరించిన తీరు సంచలనంగా మారింది. 

జార్ఖండ్  ముఖ్యమంత్రిగా  శిబు సోరేన్  మూడు దఫాలు పనిచేశారు.  శిబు సోరేన్  వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా  పనిచేసిన  శశినాథ్  ఝా కిడ్నాప్, హత్యకు సంబంధించిన కేసులో  శిబు సోరేన్ ను  పోలీసులు అరెస్ట్ చేశారు.  ఈ కేసులో శిబు సోరేన్ ను  కోర్టు నిర్ధోషిగా విడుదల చేసింది.

Lalu Prasad Yadav


బీహార్ రాష్ట్రానికి  రెండు దఫాలు సీఎంగా పనిచేసిన  లాలూ ప్రసాద్ యాదవ్  అరెస్టయ్యారు. పశువుల దాణా స్కాంలో  లాలూ ప్రసాద్ కు శిక్షపడింది.  ఈ కేసులో  లాలూ ప్రసాద్ యాదవ్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.  ఇటీవలనే  లాలూ ప్రసాద్ యాదవ్ కు  కిడ్నీ మార్పిడి  జరిగింది.  లాలూ ప్రసాద్ సతీమణి  రబ్రీదేవి కూడ  బీహార్ సీఎంగా పనిచేశారు.  బీహార్ రాష్ట్రానికి ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న తేజస్వి యాదవ్  లాలూ ప్రసాద్ తనయుడు.

హర్యానా మాజీ ముఖ్యమంత్రి  ఓం ప్రకాష్ చౌతాలా  అరెస్టై  జైలుకు వెళ్లారు.  నకిలీ పత్రాలతో  మూడు వేల మంది టీచర్లను  నియమించారని  ఓం ప్రకాష్ చౌతాలా అరెస్టయ్యారు.

YS Jagan

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  2012  మే 27న ఆస్తుల కేసులో సీబీఐ అరెస్ట్ చేసింది.  16 మాసాల పాటు జైల్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు.  16 మాసాల తర్వాత 2013 సెప్టెంబర్  24న  జైలు నుండి విడుదలయ్యారు.  2014 ఎన్నికల్లో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్‌సీపీ  ప్రతిపక్షానికి మాత్రమే పరిమితమైంది.2019 ఎన్నికల్లో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది.ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా  ఎన్నికయ్యారు. 

chandrababu

జైలుకు వెళ్లి వచ్చిన నేతలంతా  ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన సందర్భాలు కూడ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టై  జైలు నుండి ఇటీవలనే విడుదలయ్యారు. అయితే  వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఎన్నికల్లో  టీడీపీ, జనసేన కూటమికి ప్రజలు పట్టం కడుతారా లేదా అనేది  ఫలితాలు తేల్చనున్నాయి.

Latest Videos

click me!