Hyderabad Robbery
Hyderabad : మానవత్వమే లేకుండా వ్యవహరిస్తారు... డబ్బుల కోసం ప్రాణాలు తీయడానికి వెనకాడని రాక్షసులు... ఇదే దొంగలపై ప్రతిఒక్కరి అభిప్రాయం. దొంగతనానికి వెళ్లిన ఇంటిని ఊడ్చేయడమే దొంగల పని. డబ్బులు, విలువైన వస్తువులే వారి టార్గెట్. ఒక్కసారి దొంగలు దోపిడీకి ఫిక్స్ అయ్యారంటే ఏమాత్రం జాలి, దయ లేకుండా ఉన్నదంతా దొంగిలిస్తారు. ఇదే ఏ దోపిడీ దొంగయినా చేసేది.
Hyderabad Robbery
అయితే హైదరాబాద్ శివారులోని మహేశ్వరం ఓ విచిత్ర దొంగ సిసి కెమెరాలకు చిక్కాడు. ఓ హోటల్లో జరిగిన ఈ దొంగతన చాలా ఫన్నీగా వుంది. దీంతో ఈ దొంగతనం వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Hyderabad Robbery
వీడు దొంగే... కాని మంచి దొంగ :
రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఓ హోటల్లోకి అర్థరాత్రి ఓ దొంగోడు ప్రవేశించాడు. తాళం పగలగొట్టి హోటల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ముఖం కనిపించకుండా ఓ టవెల్ కట్టుకుని, తలకు క్యాప్, చేతికి గ్లౌజులు ధరించి చాలా పకడ్బందీగా దొంగతనాని వచ్చాడు. హోటల్ కౌంటర్ లోని డబ్బులను దోచుకోవాలని భావించాడు.
Hyderabad Robbery
ఎంత డబ్బుందో అని భావించిన అతడికి నిరాశే ఎదురయ్యింది. హోటల్ కౌంటర్ లోనే కాదు మొత్తం వెతికినా చిల్లిగవ్వ దొరకలేదు. దీంతో తీవ్ర నిరాశకు గురయిన అతడు సిసి కెమెరాను చేస్తూ కొన్ని సంజ్ఞలు చేసాడు. చివరకు ప్రిజ్ లోని ఓ వాటర్ బాటిల్ తో సరిపెట్టుకున్నాడు. అదికూడా ఫ్రీగా తీసుకోకుండా రూ.20 టెబుల్ పై పెట్టి వెళ్లిపోయాడు.
Hyderabad Robbery
ఇలా దొంగతనానికి వచ్చినవాడే డబ్బులు పెట్టి వెళ్లిపోయిన వీడియో ఫన్నీగా వుండటంతో సోషల్ మీడియాతో వైరల్ గా మారింది. 'ఏంది సామీ ఇది... ఒక్క రూపాయి కూడా లేదు' అనేల ఆ దొంగ సంజ్ఞలు వున్నాయి. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.హోటల్ యజమాని దీనస్థితి చూసి దొంగోడే చలించిపోయాడని కొందరు... వీడు దొంగోడే కానీ మహానుభావుడు అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Hyderabad Robbery
అయితే సిసి కెమెరాలను చూసికూడా సదరు దొంగ ఏమాత్రం భయపడకపోవడం కాస్త ఆందోళన కలిగించే అంశమే. అలాగే అతడు ఓ రాడ్డు చేతబట్టి వచ్చినట్లు వీడియోను బట్టి తెలుస్తోంది. దొంగలు ఇంత విచ్చలవిడిగా వ్యవహరిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో ఆధారంగా అయినా దొంగను పట్టుకోవాలని మహేశ్వరం వాసులు కోరుతున్నారు.