ఎస్సి, ఎస్టీలకు బడ్జెట్ లో భారీగానే నిధులు... అయినా ఇదేం ప్రచారం..! : ఎక్కడ తప్పు జరిగింది?

First Published | Jul 26, 2024, 11:24 AM IST

తెలంగాణ బడ్జెట్ 2024-25 లో నిధులు కేటాయింపులు వివాదాస్పదం అవుతున్నాయి. కొన్ని వర్గాలకు మేలు చేసేలా, మరికొన్ని వర్గాలకు చిన్నచూపారంటూ ప్రచారం జరిగింది. కానీ అసలు జరిగిందిదే... 

Bhatti Vikramarka

Telangana Budget 2024 : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుతర్వాత మొదటిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. నిన్న (గురువారం) రేవంత్ రెడ్డి కేబినెట్ ఆమోదాన్ని పొందిన బడ్జెట్ 2024-25 ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2024-24 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వ ఏ రంగానికి ఎంత ఖర్చుచేయనుంది... ఏ శాఖకు ఎన్ని నిధులు కేటాయించారో ఆర్థిక మంత్రి సభ ముందు అంటే రాష్ట్ర ప్రజల ముందు వుంచారు. 

Bhatti Vikramarka

అయితే తెలంగాణ బడ్జెట్ పై కొన్ని వర్గాలు సంతృప్తిని వ్యక్తం చేస్తే... మరికొన్ని వర్గాలు అసంతృప్తితో వున్నాయంటూ ఓ ప్రచాారం జరుగుతుంది.  మైనారిటీలకు ఈ బడ్జెట్ లో భారీగా నిధులు దక్కాాయని... ఇదే సమయంలో ఎస్సి, ఎస్టిలకు బడ్జెట్ చాలా తక్కువ నిధులు దక్కాయంటూ ప్రచారం జరుగుతోంది.  
 


Revanth Reddy

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలు కాంగ్రెస కు అండగా నిలిచారు... ఈ విషయాన్ని పలు సందర్భాల్లో ఆ పార్టీ నాయకులే చెప్పారు. అయితే వారిని కాంగ్రెస్ కు దూరం చేయాలనో లేక ఇతర రాాజకీయ కాారణాలో తెలీదుగానీ  బడ్జెట్ లో వారికి అన్యాయం జరిగిందంటూ ప్రచారం జరుగుతోంది. 

revanth reddy

ఇదే సమయంలో మైనారిటీలకు భారీగా నిధులు కేటాయించారనేది ప్రచారం.  గత బడ్జెట్ లో కేసీఆర్ సర్కార్ మైనారిటీలకు కేటాయించింది కేవలం రూ.2200 కోట్లు. కానీ తాజా బడ్జెట్ లో వారికి ఏకంగా రూ.3002 కోట్లు కేటాయించారు...అంటే గతంలో పోలిస్తే మైనారిటీలకు భారీగా నిధులు దక్కాయనే ప్రచారం జరుగుతోంది.. 

Budget 2024

ఇలా ఎస్సి, ఎస్టీలకు గత బిఆర్ఎస్ ప్రభుత్వం రూ.21,072 కోట్లు కేటాయిస్తే ఈ ప్రభుత్వం కేవలం రూ.7638 కోట్లు కేటాయించిందంటూ డిపార్ట్ మెంటల్ వైస్ బడ్జెట్ 2024-25 పేరుతో ఓ పట్టిక సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. కానీ నిజానికి బడ్జెట్ లో ఎస్సిల సంక్షేమానికి 33,124 కోట్లు,ఎస్టీల సంక్షేమానికి రూ.17.056 కోట్ల రూపాయలను కేటాయించినట్లు ప్రకటించారు. దీన్నిబట్టి సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న బడ్జెట్ లెక్కలు తప్పుగా వున్నట్లు అర్థమవుతోంది.  

Latest Videos

click me!