కేంద్రం తెలంగాణకు రూ.50 వేల కోట్లిచ్చింది... తెలంగాణ బడ్జెట్ లోనే ఆ లెక్కలు..!!

First Published | Jul 26, 2024, 3:39 PM IST

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది? అంటూ కాంగ్రెస్, బిఆర్ఎస్ చేస్తున్న ప్రచారానికి బిజెపి నేతలు ఏమిచ్చిందో చూడండి?  అంటూ కౌంటర్ ఇస్తున్నారు. ఇలా తాజాగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆసక్తికర లెక్కలు చెప్పారు. 

Telangana Budget 2024

Telangana Budget 2024 : కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ 2024-25 లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్డిఏ భాగస్వామ్య పార్టీ తెలుగుదేశం అధికారంలో వున్న ఆంధ్ర ప్రదేశ్ కు కేంద్రం భారీ నిధులు కేటాయించింది కేంద్రం. ఇదే ఇప్పుడు తెలంగాణలో పొలిటికల్ హీట్ రాజేసింది.ఓ తెలుగు రాష్ట్రానికి భారీగా నిధులిచ్చి మరో తెలుగు రాష్ట్రానికి మొండిచేయి చూపించారంటూ మండిపడుతున్నారు. ఇలా తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై చర్చించారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీలు మోదీ సర్కార్ పై మాటల దాడి చేస్తున్నారు. 

Telangana Budget 2024

అయితే కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ దక్కిన నిధులెన్ని? ఇది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకులేమో కేంద్రం తెలంగాణ పేరెత్తడానికి ఇష్టపడలేదు... ఇంక నిధుల మాటెక్కడిది అంటున్నాయి. వీరికి తెలంగాణ బిజెపి నాయకులు కౌంటర్ ఇస్తున్నారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన కేటాయింపులు ఇవేనంటూ కొన్ని లెక్కలు చెబుతున్నారు. ఇలా ఎవరి లెక్కలు వారు జెబుతున్నారు... కానీ తెలంగాణ ప్రజానీకానికి మాత్రం క్లారిటీ రావడం లేదు. 


Telangana Budget 2024

ఇదే సమయంలో నిన్న(గురువారం) తెలంగాణ బడ్జెట్ 2024-25 ని రేవంత్ సర్కార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. దీంతో ఇటీవల కేంద్ర బడ్జెట్ పై కాంగ్రెస్ నేతలు చేసిన కామెంట్స్ ను బిజెపి నాయకులు గుర్తుచేస్తున్నారు.  తెలంగాణ బడ్జెట్ లోని అంశాలను ఉదహరిస్తూ రేవంత్ సర్కార్ పై ఎదురుదాడికి దిగారు. 
 

Telangana Budget 2024

తెలంగాణకు కేంద్ర ఎంతిచ్చింది..? 

తెలంగాణకు కేంద్ర ఏమిచ్చింది? అని ప్రశ్నిస్తూనే రేవంత్ సర్కార్ బడ్జెట్ రూపంలో జవాబు ఇచ్చిందని మెదక్ ఎంపి రఘునందన్ రావు అన్నారు. తెలంగాణ బడ్జెట్ లో కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా రూ.26 వేల కోట్లుగా చూపించారు... గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కింద రూ.21 వేల కోట్ల పైన చూపించారని బిజెపి ఎంపీ పేర్కొన్నారు. ఈ రెండు కలిపితే దాదాపు రూ.50 వేల కోట్లు... ఇదే కేంద్రం నుండి తెలంగాణకు వచ్చిందని రఘునందన్ పేర్కొన్నారు. 
 

Telangana Budget 2024

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే కాదు కాంగ్రెస్ నాయకులందరికీ కేంద్రం తెలంగాణకు ఏమిచ్చిందో తెలుసని బడ్జెట్ ను చూస్తేనే అర్థమవుతుందన్నారు. కానీ తమ రాజకీయాల కోసం కేంద్రపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని...వారికి బిఆర్ఎస్ వంతపాడుతోందన్నారు. నిధులు వచ్చుడో, ఇద్దరం సచ్చుడో అంటున్నారు కదా? ఢిల్లీ జంతర్ మంతర్ వద్దకు రండి... తెలంగాణకు నిధులు వచ్చాయని తేలితే ముక్కు నేలకు రాస్తారా..? అని రఘునందన్ ప్రశ్నించారు. 

Telangana Budget 2024

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం నిధులు ఇచ్చింది... దీంతో ఇళ్లు కట్టించి ఇందిరమ్మ ఇళ్లుగా ప్రచారం చేసుకునే పనిలో రేవంత్ సర్కార్ వుందున్నారు. తెలంగాణకు కేంద్రం ఎన్ని ఇళ్లు మంజూరు చేసిందో లెక్కలున్నాయి...చెప్పమంటారా? అని ప్రశ్నించారు. అంతేకాదు ఆయుష్మాన్ భారత్ పథకం కింద వైద్య ఖర్చులను రూ.10 లక్షలకు కేంద్రం పెంచింది...దీన్నే ఆరోగ్యశ్రీగా పేర్కొంటూ కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోందని అన్నారు.ఇలా అనేక కేంద్ర పథకాలను తమవిగా కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోందని రఘునందన్ రావు అన్నారు. 

Telangana Budget 2024

ఇక కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ ఊసే లేదన్న విమర్శలకు రఘునందన్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ బడ్జెట్ లో రాష్ట్రంలోని 33 జిల్లాల పేర్లను ప్రస్తావించారా? అంటూ రేవంత్ సర్కార్ ను నిలదీసారు. కేంద్రం ఏ ఒక్క రాష్ట్రానికి పక్షపాతంగా వ్యవహరించలేదు.. అన్ని రాష్ట్రాలకు సమపాళ్లలో కేటాయింపులు చేసిందన్నారు.   
బడ్జెట్‌ ను పూర్తిగా పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుందని అన్నారు. 

Telangana Budget 2024

తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్నా... రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నా ఆలోచన విధానంలో మార్పు లేదని అన్నారు.  కేవలం జెండాలు మాత్రమే మారాయి తప్ప విధానాలు మారలేవన్నారు.మార్పు ఏదైనా ఉందా అంటే దానం నాగేందర్ లాంటి వారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారడమే... కుర్చీలు మారడమేనని ఎద్దేవా చేసారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రూ.20 కోట్లతో కేసీఆర్ కొంటే... ఇప్పుడు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను రూ.5 కోట్లకే కాంగ్రెస్ కొంటోందట...ఇదీ కాంగ్రెస్, బిఆర్ఎస్ రాజకీయాలు అంటూ మండిపడ్డారు.

Telangana Budget 2024

తెలంగాణ బడ్జెట్ లో మైనారిటీలకు భారీగా నిధులు కేటాయించడంపైనా రఘునందర్ మాట్లాడారు. మైనారిటీల పండుగల కోసం రూ.33 కోట్లు కేటాయించారు? మరి తెలంగాణలో హిందువులు లేరా? వారి పండుగలకు నిధులివ్వరా? సెక్యులరిజం అంటే ఇదేనా? అని కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిని బిజెపి ఎంపి రఘునందన్ ప్రశ్నించారు. 

Latest Videos

click me!