Telangana New Airports: హైదరాబాద్ వెళ్లక్కర్లేదు.. తెలంగాణలో మరో 3 జిల్లాలకు ఎయిర్‌పోర్ట్‌లు.. ఈ ప్రాంతాల రూపురేఖలు ఛేంజ్

Published : Jul 06, 2026, 02:10 PM IST

Telangana New Airports: తెలంగాణలో ఎయిర్‌పోర్టుల విస్తరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెం జిల్లాల్లో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుతో ప్రాంతీయ కనెక్టివిటీ మారనుంది. రియల్ ఎస్టేట్ బూమ్ తో ఈ ప్రాంతాల రూపురేఖలు మారనున్నాయి. 

PREV
16
తెలంగాణ రవాణా ముఖచిత్రం మార్చేలా 3 కొత్త విమానాశ్రయాలు

తెలంగాణ కు కేంద్ర గుడ్ న్యూస్ చెప్పింది. మరో మూడు కొత్త విమానాశ్రయాలు రాబోతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో కేవలం శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో జిల్లాల ప్రజలు ఫ్లైట్ జర్నీ కోసం ఎక్కడికి వెళ్లాలన్నా హైదరాబాద్ రావాల్సి వస్తోంది. కానీ ఇకపై ఆ ఇబ్బందులు తప్పనున్నాయి.

తెలంగాణలో ఏవియేషన్ రంగాన్ని భారీగా విస్తరిస్తూ మరో మూడు కొత్త విమానాశ్రయాలను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు ముమ్మరం చేశాయి. హైదరాబాద్‌లో జరిగిన ఏరోమార్ట్ 2026 సదస్సులో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ గుడ్‌న్యూస్ చెప్పారు.

26
నిజాం కాలం నాటి మామునూరుకు పూర్వవైభవం

వరంగల్‌లోని మామునూరు ఎయిర్‌పోర్టుకు ఒక సూపర్ హిస్టరీ ఉంది. 1930లోనే నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ దీనిని నిర్మించారు. స్వాతంత్య్రానికి పూర్వమే ఇది దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయంగా సేవలు అందించింది. ఇప్పుడు ఈ బ్రౌన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టును తిరిగి పునరుద్ధరించనున్నారు. దీనికి సంబంధించి భూసేకరణ, మౌలిక సదుపాయాల పనులు వేగంగా జరుగుతున్నాయి.

వచ్చే నెలలోనే ఈ ప్రాజెక్టుకు అధికారికంగా శంకుస్థాపన చేయనున్నారు. రాబోయే రెండేళ్లలో ఇక్కడ పనులు పూర్తి చేసి, మొదట కార్గో సేవలను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. దీనివల్ల వరంగల్ చుట్టుపక్కల ఉండే టెక్స్‌టైల్, ఐటీ, పారిశ్రామిక రంగాలు నెక్స్ట్ లెవెల్‌కు వెళ్తాయి.

36
ఆదిలాబాద్‌లో డిఫెన్స్, సివిల్ హైబ్రిడ్ ఎయిర్‌పోర్ట్

ఉత్తర తెలంగాణ రవాణా ముఖచిత్రాన్ని మార్చేలా ఆదిలాబాద్‌లో మరో భారీ ఎయిర్‌పోర్ట్ రెడీ అవుతోంది. ఇక్కడ గతంలో వాయుసేన (IAF) రన్‌వే ఉండేది. ఇప్పుడు దానికి అదనంగా భూమిని సేకరించి మొత్తం 1,500 ఎకరాల విస్తీర్ణంలో భారీ ఎయిర్‌ఫీల్డ్‌ను డెవలప్ చేస్తున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో అధికారులు డీపీఆర్ సిద్ధం చేస్తున్నారు.

ఈ ఎయిర్‌పోర్టును డిఫెన్స్, సివిల్ ఏవియేషన్ శాఖలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అంటే ఇటు మిలిటరీ అవసరాలకు, అటు సామాన్య పౌరుల ప్రయాణాలకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఒక పైలట్ ట్రైనింగ్ సెంటర్ కూడా రాబోతోంది.

46
భద్రాద్రి కొత్తగూడెంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్

సింగరేణి బొగ్గు గనులకు, పారిశ్రామిక ప్రాంతాలకు కేరాఫ్ అడ్రస్ అయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సరికొత్త గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన స్థలాల పరిశీలన ఇప్పటికే పూర్తయింది. అధికారులు దీనిపై ఒక సమగ్ర రిపోర్టును తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు.

కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరుగుతున్నాయని, త్వరలోనే దీనికి కూడా తుది అనుమతులు లభిస్తాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మూడు ఎయిర్‌పోర్టులు అందుబాటులోకి వస్తే తెలంగాణ ఏవియేషన్ రంగానికి గ్లోబల్ లెవెల్లో గుర్తింపు దక్కడం ఖాయం.

56
గ్లోబల్ ఏరోస్పేస్ హబ్‌గా హైదరాబాద్

మరోవైపు ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో తెలంగాణ గ్లోబల్ హబ్‌గా దూసుకుపోతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో అమెరికా, యూకే, ఫ్రాన్స్, జపాన్ వంటి అగ్రదేశాలకు చెందిన దిగ్గజ రక్షణ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. దాదాపు 1,500 కంటే ఎక్కువ ఎంఎస్‌ఎంఈ లు ఇక్కడ విడిభాగాలు తయారు చేస్తున్నాయి.

అమెరికా అధ్యక్షుడి హెలికాప్టర్ క్యాబిన్లను టాటా సికోర్స్కీ, అపాచీ అటాక్ హెలికాప్టర్ల ఫ్యూజ్‌లేజ్‌లను బోయింగ్, ఎఫ్-16 ఫైటర్ జెట్ రెక్కలను లాక్‌హీడ్ మార్టిన్ సంస్థలు హైదరాబాద్‌లోనే తయారు చేస్తుండటం మన గర్వకారణం. సఫ్రాన్, జీఈ ఏరోస్పేస్ వంటి గ్లోబల్ కంపెనీలు కూడా ఇక్కడి నుంచే తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి.

66
రియల్ ఎస్టేట్ రంగానికి బిగ్ బూస్ట్

ఎక్కడైనా ఎయిర్‌పోర్ట్ వస్తోందంటే చాలు.. అక్కడ ల్యాండ్ వాల్యూస్ ఎలా పెరుగుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మూడు కొత్త విమానాశ్రయాల వల్ల ఆయా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ పూర్తిగా మారిపోనుంది. వరంగల్ లో కాజీపేట, హన్మకొండ, మామునూరు పరిసర ప్రాంతాల్లో డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది.

ఆదిలాబాద్ లో టౌన్ సెంటర్, హైవే కారిడార్లకు దగ్గరగా ఉన్న లేఅవుట్లలో ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో ప్రతిపాదించిన బసంత్ నగర్ స్థలంలో టెక్నికల్ ఇష్యూస్ రావడంతో, ఇప్పుడు అంతర్గావ్ వద్ద ముందస్తు సాధ్యాసాధ్యాల తనిఖీలు జరిగాయి. పారిశ్రామిక బెల్ట్ కావడంతో ఇక్కడ కూడా భూముల ధరలకు రెక్కలు రానున్నాయి. మొత్తం మీద ఈ ప్రాజెక్టులు జిల్లాల యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సృష్టించనున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories