TGDeX : తెలంగాణ ప్రభుత్వం టెక్నాలజీని అందిపుచ్చుకుని అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు సిద్దమయ్యింది. ఇప్పటికే భవిష్యత్ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే అని స్పష్టంగా అర్థమవుతోంది... అందుకే ఆ టెక్నాలజీపై రేవంత్ సర్కార్ దృష్టిపెట్టింది. ఇందులో భాగంగానే ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో ఏఐ టెక్నాలజీపై కీలక చర్యలు తీసుకున్నారు. ఆ ప్రతిపలాలు ఇప్పుడు అందుతున్నాయి.
25
TGDeX సేవలు ప్రారంభం.. అసలు ఏమిటిది?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (JICA)తో కలిసి అభివృద్ధి చేసిన తెలంగాణ డేటా ఎక్స్ఛేంజ్ (TGDeX) ప్లాట్‌ఫామ్ జులై 2 (బుధవారం) ప్రారంభం కానుంది. ఇది ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) కోసం రాష్ట్ర స్థాయిలో అభివృద్ధి చేసిన తొలి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (DPI) కావడం విశేషం. దేశంలో ఇలాంటి సరికొత్త టెక్నాలజీని తీసుకువచ్చిన రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది... ఇది గేమ్ చేంజర్ గా మారనుందని ప్రభుత్వం చెబుతోంది.
35
TGDeX లక్ష్యం
తెలగాణ డేటా ఎక్స్చేంజ్ (TGDeX) లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, స్టార్టప్‌లు, పరిశ్రమల భాగస్వాములు, పరిశోధనా సంస్థల మద్య సహకారంతో విభిన్న రంగాల్లో ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేయడమేనని అధికారులు చెబుతున్నారు. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా AI డెవలపర్లకు అధిక నాణ్యత గల డేటా, కోలాబొరేషన్ టూల్స్ అందుబాటులోకి రానున్నాయని రాష్ట్ర ఐటీ శాఖలోని ఎమర్జింగ్ టెక్నాలజీస్ విభాగం ప్రకటించింది.
ఈ ప్రాజెక్టును ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc), బెంగళూరు ఆధ్వర్యంలో చేపడుతున్నారు. JICA కు చెందిన డీఏక్స్ ల్యాబ్ (DXLab) దీనికి వ్యూహాత్మక, సాంకేతిక మార్గదర్శకత్వాన్ని అందిస్తోంది. తెలంగాణ AI మిషన్, T-Hub, MATH, ఐఐటి హైదరాబాద్, RICH (రీసెర్స్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్ (IIITH) వంటి సంస్థలు కూడా సహకారం అందిస్తున్నారు.
55
TGDeX తో పాలన సులభతరం
TGDeX ప్లాట్‌ఫామ్ ప్రభుత్వ డేటాసెట్‌ల కేంద్రంగా పనిచేస్తున్న ఓపెన్ డేటా తెలంగాణా ప్లాట్‌ఫామ్‌ను కూడా వినియోగించనుంది. ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ సంస్థలు, విద్యా సంస్థలు, ఓపెన్ సోర్స్ లేదా లైసెన్స్ డేటా ప్రొవైడర్ల మధ్య డేటా మార్పిడి ద్వారా ఈ వేదిక ఏఐ రిసెర్చ్‌కు దోహదం చేస్తుందని అంచనా. టిజీడెక్స్ ద్వారా వచ్చే ఐదేళ్లలో 2000 కంటే ఎక్కువ AI-రెడీ డేటాసెట్‌లను హోస్ట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
2024 సెప్టెంబర్‌లో విడుదల చేసిన రాష్ట్ర AI విజన్ రోడ్‌మ్యాప్ లో భాగంగా TGDeX కీలక కార్యక్రమంగా కొనసాగనుంది. TGDeX ద్వారా డేటా ఆధారిత పాలన, పరిశోధన, ఆవిష్కరణలకు బలమైన వేదిక సిద్ధమవుతుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధిలో TGDeX కీలకపాత్ర పోషిస్తుందని ప్రభుత్వం నమ్మకంతో ఉంది.