మీ సేవా సెంటర్ల వద్ద ఉద్రిక్తత.. బారులు తీరిన జనం, సెంటర్ల మూసివేత..

First Published Dec 7, 2020, 11:54 AM IST

10 వేల రూపాయలు వరద సహాయం ఇంకా ఆన్లైన్ సేవలు ప్రారంభం అవ్వలేదంటూ మీసేవా సెంటర్ల వద్ద బారులు జనం బారులు తీరారు. వరద సాయం ఇస్తానన్న సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

10 వేల రూపాయలు వరద సహాయం ఇంకా ఆన్లైన్ సేవలు ప్రారంభం అవ్వలేదంటూ మీసేవా సెంటర్ల వద్ద బారులు జనం బారులు తీరారు. వరద సాయం ఇస్తానన్న సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
undefined
మీ సేవ సెంటర్ల వద్ద బారులు జనం బారులు తీరడంతో నిర్వాహకులు మీ సేవ సెంటర్లు మూసివేశారు. ఆందోళన చేస్తున్న జనాల్ని ఇంటికి పంపించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.ఇదిలా ఉంటే వరద సాయం కోసం బాధితులు మీ సేవ సెంటర్లు వెళ్లాల్సిన అవసరం లేదని గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ తెలిపారు. జీహెచ్ఎంసీ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇంకా వరదసాయం అందని వారి వివరాలను సేకరిస్తున్నాయని పేర్కొన్నారు.
undefined
బాధితుల వివరాలు, ఆధార్ నెంబర్ ధ్రువీకరణ జరుగుతోందని, తర్వాత వారి అకౌంట్‌లోనే నేరుగా వరద సాయం డబ్బులు జమవుతాయని చెప్పారు. ఈ నెల 7వ తేదీ నుంచి వరద సహాయం మళ్లీ ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు 8 గంటల నుంచే మీ సేవకు ప్రజలు తరలివస్తున్నారు.
undefined
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 6.64 లక్షల వరద బాధిత కుటుంబాలకు రూ.664 కోట్లు అందజేసింది. మరికొంత మంది దరఖాస్తు చేసుకోగా.. మరో 3.31 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం వాయిదా వేసిన విషయం తెలిసిందే.
undefined
click me!