రేవంత్ రెడ్డితో క‌లిసి ప్ర‌మాణ‌స్వీకారం చేసిన 11 మంది తెలంగాణ‌ మంత్రులు వీరే

First Published Dec 7, 2023, 4:59 PM IST

Telangana ministers list 2023:తెలంగాణ‌లో ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి సార‌థ్యంలోని కాంగ్రెస్ స‌ర్కారు కొలువుదీరింది. ఉప ముఖ్యమంత్రిగా దళిత నేత మల్లు భట్టి విక్రమార్కతో పాటు మరో 10 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.  వారిలో దామోద‌ర్ రాజ‌న‌ర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, డి. అనసూయ సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావులు ఉన్నారు. 

Anumula Revanth Reddy

అనుముల రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డితో గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. రేవంత్‌రెడ్డి విద్యార్థిగా ఉన్నప్పుడు ఏబీవీపీలో సభ్యుడుగా ఉన్నారు. 2006లో స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థిగా జెడ్పీటీసీగా ఎన్నిక‌య్యారు. 2007లో స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేసి ఎమ్మెల్సీగా, 2009లో కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలిచారు. 2023 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచి ముఖ్య‌మంత్రిగా గురువారం ప్ర‌మాణ స్వీకారం చేశారు. 
 

Uttam Kumar Reddy

ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1999 ఎన్నికల్లో కోదాడ్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు . 2004లో కోదాడ‌, 2009, 14, 18లో హుజూర్‌నగర్ నుంచి గెలుపొందారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 

Damodar Rajanarasimha

దామోద‌ర్ రాజ‌న‌ర్సింహ

2011-2014 మధ్య ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆందోల్ నియోజకవర్గానికి  కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహించాడు. ప‌లు కీల‌క శాఖ‌ల‌కు మంత్రిగా ప‌నిచేశారు. 1989లో ఆందోల్ (SC) నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. 

komatireddy venkat reddy

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

1999 నుంచి 2014 వ‌ర‌కు వ‌రుస‌గా నాలుగు సార్లు అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. 2019లో భోంగిర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పార్ల‌మెంట్ కు ఎన్నిక‌య్యారు. 2023లో ఎన్నిక‌ల్లో నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజ‌యం సాధించారు.
 

దుద్దిళ్ళ శ్రీధర్ బాబు

దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మంథని శాసనసభ నియోజకవర్గం నుండి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, లీగల్ మెట్రాలజీ, శాసన వ్యవహారాల మంత్రిగా ప‌నిచేశారు. 
 

Ponguleti Srinivas Reddy

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

2014 ఎన్నికల్లో ఖమ్మం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి  గెలిచారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో 56,650 ఓట్ల భారీ మెజారిటీతో పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు.
 

ponnam prabhakar

పొన్నం ప్రభాకర్

విద్యార్థి ఉద్యమకారుడిగా మొద‌లైన ఆయ‌న ప్ర‌యాణం పార్ల‌మెంట్ స‌భ్యుడిగా, నేడు మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం వ‌ర‌కు సాగింది. కరీంనగర్ లోకసభ నియోజకవర్గం నుండి 2009-14 ఎంపీగా ప‌నిచేశారు. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా హుస్నాబాద్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు.
 

Konda Surekha

కొండా సురేఖ 

కొండా సురేఖ 1995లో మండల పరిషత్ కు, 1996లో పీసీసీ సభ్యురాలిగా, 1999లో శాయంపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999లో ఆమె కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ కోశాధికారిగా, మహిళా & శిశు సంక్షేమ కమిటీ, ఆరోగ్యం, ప్రాథమిక విద్య స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా ప‌నిచేశారు. 2000లో ఏఐసీసీ సభ్యురాలిగా ఉన్నారు. 2023 ఎన్నిక‌ల్లో వ‌రంగ‌ల్ తూర్పు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపొందారు. 

seethakka

డి. అనసూయ సీతక్క

ములుగు నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస‌గా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అఖిల భారత మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కూడా విధులు నిర్వ‌ర్తించారు. మాజీ మావోయిస్టు అయ‌న సీత‌క్క గురువారం నాడు తెలంగాణ మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు.

tummala nageswara rao

తుమ్మల నాగేశ్వరరావు

ఖ‌మ్మం జిల్లాలో కీల‌క‌మైన రాజ‌కీయ నాయ‌కుడు. ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు చంద్ర‌బాబు నాయుడు, కే.చంద్రశేఖ‌ర్ రావు (కేసీఆర్) పాల‌న‌లో మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార‌థ్యంలోని కాంగ్రెస్ స‌ర్కారులో మంత్రిగా ఉన్నారు. 
 

jupally krishna rao

జూప‌ల్లి కృష్ణారావు 

తెలంగాణ ప్రభుత్వంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ప‌నిచేశారు. కొల్లాపూర్ నియోజకవర్గం నుండి వరుసగా 5 సార్లు ఎన్నికైన మొదటి ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. 

click me!