నాన్నకు ప్రేమతో... మండుటెండలో తండ్రికి గొడుగుపట్టిన మంత్రి జగదీష్ రెడ్డి

Published : Apr 11, 2023, 05:15 PM IST

 మండుటెండలో కన్న తండ్రికి గొడుగుపట్టి వ్యవసాయ క్షేత్రంలో కలియతిరిగారు మంత్రి జగదీష్ రెడ్డి. 

PREV
15
నాన్నకు ప్రేమతో... మండుటెండలో తండ్రికి గొడుగుపట్టిన మంత్రి జగదీష్ రెడ్డి
Jagadish Reddy

సూర్యాపేట : డిల్లీకి రాజయినా కన్న తల్లిదండ్రులకు మాత్రం కొడుకే... ఎంత పెద్ద హోదాలో వున్నా కన్నవారికి ప్రేమానురాగాలు పంచుతూ ఆప్యాయంగా చూసుకోవడం కొడుకు బాధ్యత. తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కొడుకు బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు. మంత్రిత్వ శాఖ బాధ్యతలు, రాజకీయాలతో నిత్యం బిజీగా వుండికూడా కన్న తండ్రితో గడిపేందుకు  సమయం కేటాయించి మంచి పొలిటీషన్ గానే కాదు మంచి కొడుకుగా మార్కులు కొట్టేసారు జగదీష్ రెడ్డి. 

25
Jagadish Reddy

ఇవాళ(మంగళవారం) మంత్రి జగదీష్ రెడ్డి సొంత నియోజకవర్గం సూర్యాపేటలో పర్యటించారు. ఈ క్రమంలోనే కాస్త సమయం దొరకడంతో తండ్రితో కలిసి వ్యవసాయ పొలానికి వెళ్లారు. ఎండ ఎక్కువగా వుండటంతో తండ్రికి గొడుగుపట్టి ప్రేమను చాటుకున్నారు మంత్రి. ఇలా పొలంలో తిరుగుతున్నంతసేపు తండ్రికి గొడుగు పట్టారు మంత్రి. 

35
Jagadish Reddy

ఆస్తుల కోసం తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురిచేసే కొడుకులున్న ఈ కలికాలంలో మంత్రి తండ్రిని ఇంతలా ప్రేమించడం అందరినీ ఆకట్టుకుంది. మంత్రి హోదాలో వున్న జగదీష్ రెడ్డి తలచకుంటే పనివారితో తండ్రికి గొడుగు పట్టించవచ్చు... కానీ తానే స్వయంగా తండ్రికి సేవ చేయాలని ఆయన భావించారు. అందుకే ఎండ తగలకుండా గొడుకుపట్టి తండ్రితో పొలమంతా తిరుగుతూ ఆప్యాయతను పంచారు. 

45
Jagadish Reddy

ఇప్పటికే రాజకీయంగా ఉన్నతస్థానంలో నిలిచి ఆదర్శంగా నిలిచిన జగదీష్ రెడ్డి తాజాగా కొడుకుగానూ ఆదర్శంగా నిలిచారు. సమాజంలో మానవ సంబంధాలు పలుచబడుతున్న కాలంలో తల్లిదండ్రులను ప్రేమగా చూసుకునే జగదీష్ రెడ్డి లాంటి కొడుకులు కూడా వున్నారు. కొడుకుగా తన బాధ్యతను నిర్వర్తించి అందరికీ మానవ బంధాలు, బాందవ్యాల విలువను గుర్తుచేసారు. 

55
jagadish Reddy

మంత్రి జగదీష్ రెడ్డి నాన్నకు ప్రేమతో గొడుగుపట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మంత్రిని చూసయినా కన్న తల్లిదండ్రుల ఆలనా పాలనా మరిచిన కొడుకులు మారాలంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories