తెలంగాణ జలదీక్ష... ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకుల అరెస్టులు

First Published Jun 13, 2020, 11:02 AM IST

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపుమేరకు నీటిపారుదల ప్రాజెక్టుల వద్ద జలదీక్షకు ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. 

కరీంనగర్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నీటిపారుదల ప్రాజెక్ట్ వద్ద జల దీక్ష చేయడానికి వెళ్లే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ లు చేస్తున్నారు. ఇలా కొందరు నాయకులను ప్రాజెక్టుల వద్ద అడ్డుకోగా మరికొందరిని ఇంటివద్దే అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కీలక కాంగ్రెస్ నాయకులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు.
undefined
జగిత్యాల జిల్లా చలో తమ్మిదిహేట్ఠి ప్రాజెక్టువద్ద జలదీక్ష చేపట్టడానికి వెళుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు, రాష్ట్ర సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణా రావు లను రాత్రి రెండు గంటల సమయంలో అరెస్ట్ చేశారు.
undefined
ఇక పెద్దపెల్లి జిల్లాఎల్లంపల్లి ప్రాజెక్ట్ వద్ద జరిగే జలదీక్షకు వెళ్లకుండా మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబును పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి ముందు భారిగా పోలీసులు మోహరించారు.
undefined
తెలంగాణ కాంగ్రెస్ కమిటీ తలపెట్టిన జల దీక్ష లో భాగంగా చలో నర్మాల కార్యక్రమంలో ఎగువ మానేరు ప్రాజెక్టును సందర్శించడానికి వెళ్తున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో అరెస్ట్ చేశారు.
undefined
హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవేల్లి -గండిపల్లి ప్రాజెక్ట్ నిర్మాణ పనులను కెసిఆర్ ప్రభుత్వం జాప్యం చేయడాన్ని నిరసిస్తూ నేడు ప్రాజెక్ట్ కట్ట ఎక్కి నిరసన తెలిపారు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్. అయితే పోలీసులు సంపత్,నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి బొమ్మ శ్రీరామ్ లతో పాటు సుమారు 150 మంది కాంగ్రెస్ కార్యకర్తలు అరెస్ట్ చేశారు.
undefined
రాజన్నసిరిసిల్ల జిల్లాఛలో నర్మాల జల దీక్ష నేపథ్యంలో వేములవాడ నియోజకవర్గ ఇంచార్జ్ ఆది శ్రీనివాస్ ను పోలీసులు ముందస్తుగానే హౌజ్ అరెస్ట్ చేశారు.వీరితో తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేశారు.
undefined
click me!