ఆయన ఐఏఎస్… ఆమె ఐపిఎస్. ఇద్దరూ ప్రేమించుకున్నారు… అనుకుంటే చాలాా ఘనంగా పెళ్లిచేసుకోవచ్చు. కానీ చాలా సాధాసీదాాగా పెళ్లితంతూ ముగించారు. వాళ్ల పెళ్లిఖర్చు ఎంతో తెలుసా?
చాలా మంది ఐఎఎస్ లేదా ఐపిఎస్ అధికారులు తమలాగే సివిల్ సర్వెంట్స్ ను పెళ్లాడటం తరచూ చూస్తుంటాం. యూపిఎస్సి (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్) ఎగ్జామ్ తర్వాత ట్రైనింగ్ సమయంలో ప్రేమ… ఉద్యోగంలో చేరాక పెళ్లిచేసుకుంటారు. ఇలా తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారి యువరాజ్ మర్మత్, తెలంగాణకే చెందిన పి. మోనిక ఐపిఎస్ కథ కూడా అంతే. ఈ జంటపెళ్లి వైరల్ గా మారింది.
25
ఎవరీ యువరాజ్ మర్మత్?
ఐఏఎస్ అధికారి యువరాజ్ మర్మత్ రాజస్థాన్‌లోని గంగానగర్‌కు చెందినవారు. యూపిఎస్సికి ముందు అతడు బిటెక్ పూర్తి చేశారు… బి హెచ్ యు నుండి సివిల్ ఇంజనీరింగ్ చేశారు. ఆ తర్వాత యూపిఎస్సికి ప్రిపేర్ అయ్యారు. ఐఎఎస్ కు ముందు యువరాజ్‌ని ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ (UPSC IES)కి ఎంపికయ్యారు. యువరాజ్ యూపిఎస్సి 2021లో 458వ ర్యాంక్ సాధించారు.
35
ఎవరీ మౌనిక?
పి. మౌనిక తెలంగాణకు చెందిన అమ్మాయి. ఈమె కూడా 2021లో యూపిఎస్సి ఆలిండియా 637వ ర్యాంక్ సాధించారు. యూపిఎస్సిలో చేరడానికి ముందు మౌనిక వైద్య రంగంలో ఉన్నారు. ఆమె ఫార్మసీకి సంబంధించిన కోర్సులు చదివారు. అంతేకాకుండా మౌనికకు క్రీడలు, సంగీతంలో కూడా ఆసక్తి ఉంది.
యువరాజ్, మౌనిక మొదట మస్సోరీలో కలిశారు. ఇద్దరూ యూపిఎస్సి శిక్షణ కేంద్రంలో ఒకరినొకరు చూసుకున్నారు. ఇక్కడే వారి స్నేహం ప్రేమగా మారింది. 2023లో వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
55
ఈ సివిల్ సర్వెంట్ జంట పెళ్ళి ఖర్చెంతో తెలుసా?
ఈ IAS, IPS అధికారుల సాదాసీదా పెళ్లి అప్పట్లో వార్తల్లో నిలిచింది. ఇంతపెద్ద అధికారులైనా ఈ జంట కేవలం రూ.2000 ఖర్చుతో పెళ్లి చేసుకున్నారు. ఈ ఇద్దరు అధికారులు కేవలం పూలదండలు మార్చుకుని, స్వీట్స్ తినిపించుకుని చాలా సింపుల్‌గా మ్యారేజ్ చేసుకున్నారు.